Steel Bridge : తెలంగాణలో స్టీల్ బ్రిడ్జి.. ప్రారంభానికి సిద్ధం..!

ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి

Steel Bridge : తెలంగాణలో స్టీల్ బ్రిడ్జి.. ప్రారంభానికి సిద్ధం..!

హైదరాబాద్. మనసాక్షి :

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో రోడ్లు , ఫ్లేవర్ బ్రిడ్జిలు అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నాయి. మహానగరంగా పేరున్న హైదరాబాదులో ఫ్లై ఓవర్లు, స్కై వాక్ లు నిర్మించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కృషి చేస్తుంది.

 

అందులో భాగంగా హైదరాబాద్ నగర ప్రజలకు జిహెచ్ఎంసి మరో గుడ్ న్యూస్ అందించింది. నగరంలో మరో కొత్త స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి రానున్నది.

 

ఇందిరా పార్క్ , వి ఎస్ టి మధ్య నిర్మించిన ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. 2.28 కిలోమీటర్ల మేర ఈ స్టీల్ బ్రిడ్జిని నాలుగు లైన్లతో నిర్మించారు . 13వేల టన్నుల స్టీల్ ను ఉపయోగించారు. ఈ నిర్మాణానికి సుమారుగా 350 కోట్ల రూపాయల వ్యయం అయినట్లుగా జిహెచ్ఎంసి అధికారులు పేర్కొంటున్నారు.

 

ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి :

 

హైదరాబాద్ నగరంలో నడిబొడ్డున నిర్మించిన ఈ ఫ్లైఓవర్ స్టీల్ బ్రిడ్జి వల్ల వి ఎస్ టి జంక్షన్, ఆర్ టి సి క్రాస్ రోడ్స్, ఇందిరా పార్క్ క్రాస్ రోడ్లలో ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తీరని ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో జనావాసాలతో పాటు వాణిజ్య సంస్థలు, కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు, కాలేజీలు, స్కూళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దాంతో ట్రాఫిక్ జామ్ విపరీతంగా ఉండటం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 

అందుకుగాను ఈ ప్రాంతంలో ఫ్లేవర్ నిర్మించాలని జిహెచ్ఎంసి నిర్ణయించింది. స్థలం ఇచ్చేందుకు కూడా కూడా భూ యజమానులు ముందుకు వచ్చారు. నగరం మధ్యలో కావటం వల్ల నిర్మాణానికి భూసేకరణకు ఖర్చు అదనంగా అయినప్పటికీ నిర్మాణ పనులు పూర్తి చేశారు.

 

ALSO READ :

 

1. Rythu : నెల రోజుల్లో కోటీశ్వరుడైన రైతు.. 20 ఏళ్ల దరిద్రం పోయింది..!

2. Runa Mafi : తెలంగాణలో రైతుల పంట రుణాలు మాఫీ.. ఎప్పుడంటే..!

3. Telangana : తెలంగాణ ఎన్నికలకు ముందే ఐడి కార్డు ఉంటే సరిపోదు.. ఓటర్ల జాబితాలో మీ పేరు.. ఉందో? లేదో? ఇలా చూసుకోండి..!

 

 

ఈ నిర్మాణం వల్ల లింగంపల్లి జంక్షన్, అశోక్ నగర్ క్రాస్ రోడ్డు వద్ద కూడా ట్రాఫిక్ సమస్య కాస్త తగ్గుతుందని పలువురు పేర్కొంటున్నారు. మెట్రో రైల్ మార్గం మీదుగా వెళ్లే వాహనాలు తప్ప ఫ్లైఓవర్ పనులన్నీ ఈ నెలాఖరులోగా పూర్తికానున్నాయి.

 

వాస్తవానికి ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం డిసెంబర్ 2022 లోనే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ రష్యా – ఉక్రెయిన్ యుద్ధం వల్ల స్టీల్ సరఫరా ఆగిపోవడంతో నిర్మాణ పనులు ఆలస్యం అయ్యాయి. ఈ నెల ఆఖరికి పనులు మొత్తం పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 15న ఈ స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు.

 

ఈ స్టీల్ బ్రిడ్జి పై ఎల్ఈడి లైట్లు, క్రాస్ బారియర్ల ఏర్పాటుతో పాటు గంటకు 40 కిలోమీటర్ల గరిష్ట వేగంతో మాత్రమే వాహనాలు వెళ్లాలని సూచికలు ఏర్పాటు చేయనున్నారు.

 

IMP NEWS.. ALSO READ :

 

1. GPay : గూగుల్ పే వినియోగించే వారికి భారీ గుడ్ న్యూస్.. మళ్లీ క్యాష్ బ్యాక్.. ఎలానో తెలుసుకుందాం..!

2. Railway Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో 3624 రైల్వే ఉద్యోగాలు..!

3. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి అదిరిపోయే సర్వీసులు..!