Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

SBI : ఎస్ బీ ఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. హోమ్ లోన్ తీసుకునే వారికి మరింత ఊరట..!

SBI : ఎస్ బీ ఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. హోమ్ లోన్ తీసుకునే వారికి మరింత ఊరట..!

మనసాక్షి , వెబ్ డెస్క్ :

దేశంలోనే ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు గా కొనసాగుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు తాజాగా గుడ్ న్యూస్ తెలియజేసింది. బ్యాంకు లోన్ పొందాలనుకునే వారికి ఊరట కలిగించే విధంగా తీపి కబురు చెప్పింది. తాజాగా రుణాలపై 50 నుంచి 100% ప్రాసెసింగ్ ఫీజు మాఫీ బెనిఫిట్ అందిస్తోంది. హోమ్ లోన్ తీసుకునే వారికి ఇది మరింత ఊరట కలిగించే విధంగా ఉంది.

 

హోమ్ లోన్ ఎస్ బీ ఐ వెబ్సైట్ ప్రకారం … చూస్తే హెచ్ ఎల్ అండ్ టాప్ అప్ రుణాలకు ప్రాసెసింగ్ ఫీజులో 50% తగ్గింపు లభిస్తుంది. కనీసం 2 వేల రూపాయల నుంచి గరిష్టంగా 5 వేల రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. అదే విధంగా 100% ప్రాసెసింగ్ ఫీజు బెనిఫిట్ కూడా పొందవచ్చును. టేక్ ఓవర్స్ , రీసెల్, రెడీ టు మూవ్ ప్రాపర్టీ లోన్స్ కు ఇది వర్తిస్తుంది.

 

ALSO READ :

 

1 . GPay : గూగుల్ పే గుడ్ న్యూస్ .. కొత్త ఫీచర్.. యూపీఐ లైట్ సదుపాయం..!

2. Telangana : తెలంగాణ ఎన్నికలకు ముందే ఐడి కార్డు ఉంటే సరిపోదు.. ఓటర్ల జాబితాలో మీ పేరు.. ఉందో? లేదో? ఇలా చూసుకోండి..!

3. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి అదిరిపోయే సర్వీసులు..!

 

 

అలాగే ఇన్స్ స్టాల్ హోమ్ టాప్ అప్, రివర్స్ మార్ట్ గేజ్, ఈఎంఐ వంటి రుణాలకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు మాఫీ బెనిఫిట్ ఉండదు. సాధారణంగా 0.35 శాతం మొత్తాన్ని ప్రాసెసింగ్ ఫీజు కింద వసూలు చేస్తుంది. గరిష్టంగా పదివేల రూపాయల వరకు ఈ ఫీజు పడుతుంది. అయితే ఇప్పుడు తగ్గింపు పొందవచ్చును. 50 నుంచి 100% వరకు ప్రాసెసింగ్ ఫీజు తగ్గింపు ఉంటుంది.

 

సిబిల్ స్కోర్ 750 నుంచి 800 వరకు ఉంటే వడ్డీ రేటు 9.15 శాతంగా ఉంటుంది . అదే ఆఫర్ కింద అయితే 8.7% వడ్డీకే పొందవచ్చును. 700 నుంచి 740 వరకు సిబిల్ స్కోర్ ఉంటే వడ్డీ రేటు 9.35 శాతంగా ఉంటుంది. అయితే ఆఫర్ కింద 8.8% వడ్డీకే పొందవచ్చును. సిబిల్ స్కోర్ 650 నుంచి 699 వరకు ఉంటే వడ్డీ రేటు 9.45% ఉంటుంది. సిబిల్ స్కోర్ 550 నుంచి 649 వరకు ఉంటే వడ్డీ రేటు 9.65 శాతంగా ఉంటుంది. ఈ రుణాలపై ఎలాంటి తగ్గింపు ఉండదు.

 

ALSO READ ;

1. Rythu : నెల రోజుల్లో కోటీశ్వరుడైన రైతు.. 20 ఏళ్ల దరిద్రం పోయింది..!

2. GPay : గూగుల్ పే గుడ్ న్యూస్ .. కొత్త ఫీచర్.. యూపీఐ లైట్ సదుపాయం..!

3. Runa Mafi : తెలంగాణలో రైతుల పంట రుణాలు మాఫీ.. ఎప్పుడంటే..!

 

మరిన్ని వార్తలు