CRIME : రెండంతస్తులు చూపించాడు.. రెండున్నర కోట్లకు ముంచాడు..!

CRIME : రెండంతస్తులు చూపించాడు.. రెండున్నర కోట్లకు ముంచాడు..!

హైదరాబాద్ , మనసాక్షి :

 

తన ఆస్తిని విక్రయిస్తున్నానని నమ్మించి రెండు అంతస్తుల భవనాన్ని చూపించి .. రూ. 2. 40 కోట్లకు ముంచిన సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ కు చెందిన జమ్ముల సునీల్ కుమార్ కు కొన్నాళ్ల క్రితం వెంకటేష్ ధనరాజ్ పరిచయమయ్యాడు. తన సోదరుడు ప్రసాద్ తో కలిసి తార్నాకలోని 400 గజాల స్థలంలో బ్యాంకు రుణంతో భవనం నిర్మిస్తున్నట్లు చెప్పాడు. నిధుల కొరత వల్ల పనులు ఆపేసినట్లు వెంకటేష్ తెలిపారు.

 

ALSO READ : 

 

1. Rythu : నెల రోజుల్లో కోటీశ్వరుడైన రైతు.. 20 ఏళ్ల దరిద్రం పోయింది..!

2. Runa Mafi : తెలంగాణలో రైతుల పంట రుణాలు మాఫీ.. ఎప్పుడంటే..!

3. Railway Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో 3624 రైల్వే ఉద్యోగాలు..!

4. TSRTC : పల్లె వెలుగు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. బస్సు పాస్ ల అమలుకు నిర్ణయం..!

 

 

దాంతో భవనంలోనే మొదటి రెండు అంతస్తులను 2.60 కోట్ల రూపాయలకు అమ్మేయాలని నిర్ణయించినట్లు చెప్పాడు. కాగా సునీల్ కుమార్ ఆ ఇంటిని కొనేందుకు రెండు విడతల్లో వెంకటేష్, అతని భార్య లక్ష్మి లకు 2. 40 కోట్ల రూపాయలు చెల్లించారు. మిగతా 20 లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు.

 

కాగా రిజిస్ట్రేషన్ చేయకుండా.. ఆస్తి పత్రాలు ఇవ్వకుండా వెంకటేష్ తప్పించుకు తిరుగుతున్నాడు. దాంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.