Rains : వర్షాలు తగ్గుముఖం పట్టాయి.. కానీ..!

Rains : వర్షాలు తగ్గుముఖం పట్టాయి.. కానీ..!

హైదరాబాద్, మన సాక్షి:

పది రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు ప్రజలను అతలాకుతలం చేశాయి. తీవ్ర అల్పపీడనం వల్ల భారీతోపాటు అతి భారీ వర్షాలు కూడా కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. విద్యాసంస్థలకు ప్రభుత్వం వరుసగా సెలవులను కూడా ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలకు అధికారులు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

 

రోడ్లు గుంతల మయంగా మారాయి. పలు జిల్లాలలో భారీ వర్షాల వల్ల ఆరెంజ్ అలెర్ట్, రెడ్ అలర్ట్ కూడా అధికారులు జారీ చేశారు. కొన్నిచోట్ల ఇల్లు కూలిపోవడంతో పాటు తీవ్ర నష్టం ఏర్పడింది.

 

ఆదిలాబాద్ , నిర్మల్, కొమురం భీం, ఆసిఫాబాద్, నిజామాబాద్ ,యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్ ,కామారెడ్డి, జిల్లాలలో ఆరంజ్ అలర్ట్ జారీ చేయగా కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, ములుగు, భూపాలపల్లి ,భద్రాద్రి కొత్తగూడెం ,సిద్దిపేట, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ,వికారాబా,ద్, మహబూబ్ నగర్ జిల్లాలలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

ఉమ్మడి వరంగల్,, ఖమ్మం ,నల్గొండ జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసాయి. హైదరాబాద్ మహానగరంలో పలు కాలనీలు నీట మునిగాయి. కాగా శనివారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

 

ALSO READ : 

  1. Chicken : చికెన్ కిలో రూ.100 మాత్రమే.. గంటలోనే అన్ని షాపుల్లో ఖాళీ..!
  2. Womens : నిరుపేద మహిళలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు..!
  3. TSRTC : ప్రయాణికులకు ఆర్టీసీ మరో శుభవార్త .. రూ. 50కే రోజంతా ప్రయాణం..!
  4. Atm Card : ఏటీఎం కార్డు వినియోగదారులకు ఆర్బీఐ కొత్త రూల్స్.. మారిన నిబంధనలు..!
  5. Telangana : సారూ.. ఏవీ..? ఆ.. రూ.10 వేలు..?

 

జూలై 29, 30, 31 వ తేదీలలో వర్షాల వల్ల ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. కానీ ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. పది రోజులపాటు వర్షాలు తెలంగాణ రాష్ట్రం మొత్తం ముంచెత్తగా తిరిగి ఆగస్టు , సెప్టెంబర్ లో కూడా భారీ వర్షాలు పడితే రైతులకు నష్టం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ప్రస్తుతం గోదావరి పరివాహక ప్రాజెక్టులన్ని పూర్తిగా నిండిపోగా గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తుంది.