Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య
Miryalaguda : జేఈఈ మెయిన్స్ లో KLN విజయకేతనం..!
జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో మిర్యాలగూడ పట్టణానికి చెందిన కె.ఎల్.ఎన్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు.

Miryalaguda : జేఈఈ మెయిన్స్ లో KLN విజయకేతనం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో మిర్యాలగూడ పట్టణానికి చెందిన కె.ఎల్.ఎన్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. కె చరణ్ ఆల్ ఇండియా 351 ర్యాంక్ సాధించి టాప్ ఎన్ఐటిలో సీటు సాధించనున్నారు. అదేవిధంగా శివ చరణ్ 7577 ర్యాంకు సాధించారు. వారితో పాటు అడ్వాన్స్ కు సెలెక్ట్ అయిన వారిలో మౌనిక, అస్మ, చాణక్య, శ్రీవల్లి, మనస్విని, హేమలత ఉన్నారు.
గత 20 సంవత్సరాలుగా వరుస విజయాలు సాధిస్తున్న కే ఎల్ ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఈ ఏడాది కూడా ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ కిరణ్ కుమార్, డైరెక్టర్లు నరేందర్ రెడ్డి, పి ఎల్ ఎన్ రెడ్డి, హనుమంత రెడ్డి, చైతన్య ఆనంద్ అభినందించారు.









