WhatsApp : వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. అదిరిపోయే ఫీచర్ మరొకటి..!

WhatsApp : వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. అదిరిపోయే ఫీచర్ మరొకటి..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
స్మార్ట్ ఫోన్ వినియోగించే వారందరూ వాట్సాప్ వినియోగించడం సర్వసాధారణమైంది. యూజర్లకు తక్కువ సమయంలో సమాచారం, ఫోటోలు, వీడియోలు అందజేయడానికి ప్రతి ఒక్కరు వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. కాగా వాట్సప్ యూజర్లకు ఎప్పటికప్పుడు మరిన్ని కొత్త ఫీచర్లను అందజేస్తూ మెరుగైన సౌకర్యాలను అందజేస్తుంది. వీడియో కాలింగ్, ఆడియో కాలింగ్ , వాయిస్ మెసేజ్ లు ఇలా సరికొత్తగా ఫీచర్లను అందిస్తుంది.
యూజర్లు ఎప్పటికప్పుడు వాట్సాప్ ను అప్డేట్ చేసుకుంటే కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తుంటాయి. ప్రస్తుతం వాట్సాప్ యూజర్లకు మరో శుభవార్త తెలియజేసింది. అదిరిపోయే ఫీచర్ ను తీసుకొచ్చింది. వాట్సాప్ కొత్త ఫీచర్ ఏ విధంగా పనిచేస్తుందో మెటా సీఈవో జూకర్ బర్గ్ వీడియో ద్వారా తెలియజేశారు.?
వాట్సాప్ లో టెక్స్ట్ బాక్స్ పక్కనే వీడియో రికార్డు సింహం ఉంటుంది. దాని సహాయంతో వాయిస్ మెసేజ్ లు ఎలా అయితే పంపుతామో.. అలాగే వీడియో సందేశాలను కూడా పంపించుకోవచ్చు. అయితే ఒకసారి 60 నిడివి మాత్రమే రికార్డు చేయవచ్చు. శుభవార్తలు, శుభాకాంక్షలు తెలిపేందుకు ఈ వీడియో సందేశాలను వినియోగించుకోవచ్చు. ఈ వీడియో సందేశం మాదిరిగానే ఎండ్ టు ఎండ్ ఎంక్రిప్ట్ చేయబడిందని ఆ కంపెనీ తెలిపింది.
ALSO READ :
1. Restarent : ఆ రెస్టారెంట్ లో తినాలంటే నాలుగేళ్ల ముందే బుక్ చేసుకోవాలంట.. స్పెషల్ ఏంటో..?
2. Womens : నిరుపేద మహిళలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు..!
ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాట్సాప్ వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది. అయితే మీరు పంపబడిన వీడియో సౌండ్ లేకుండా ప్లే అవుతుంది. సౌండ్ కావాలంటే వీడియో పై ప్రెస్ చేయాల్సి ఉంటుంది.
ఈ కొత్త ఫీచర్ ను దశలవారీగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు యాజమాన్యం తెలియజేసింది. ఈ అప్డేట్ ను మాన్యువల్ గా పొందేందుకు ప్లే స్టోర్, యాప్ స్టోర్ ని సందర్శించాలని తెలియజేసింది.
ALSO READ :
1. Chicken : చికెన్ కిలో రూ.100 మాత్రమే.. గంటలోనే అన్ని షాపుల్లో ఖాళీ..!
2. TSRTC : ప్రయాణికులకు ఆర్టీసీ మరో శుభవార్త .. రూ. 50కే రోజంతా ప్రయాణం..!