Telangana : తెలంగాణలో రైతు బీమా తరహాలోనే.. మరొకటి..!

Telangana : తెలంగాణలో రైతు బీమా తరహాలోనే.. మరొకటి..!
హైదరాబాద్ , మనసాక్షి :
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మరో శుభవార్త తీసుకురానున్నది. తెలంగాణలో రైతులకు రైతు బీమా పథకాన్ని అందిస్తున్న తరహాలోనే మరో నూతన పథకాన్ని తీసుకురానున్నది. రైతులకు రైతు బీమా అందించినట్లుగానే కార్మికులకు కార్మిక భీమా పథకాన్ని తీసుకురానున్నది. ఈ విషయాన్ని మంత్రి హరీష్ రావు ప్రకటించారు.
సిద్దిపేటలో కార్మిక భవన్ కు ఒక ఎకరం స్థలం కేటాయింపు అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కార్మికుల సంక్షేమం కోసం తన శక్తినంత ఉపయోగించి కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో భవన నిర్మాణరంగ కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు.
రైతు బీమా.. తరహాలోనే కార్మిక భీమా తీసుకొస్తామని, కార్మికుడి కార్డు రెన్యువల్ 10 ఏళ్లకు పెంచుతామని పేర్కొన్నారు. లక్షన్నర రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల బీమా పెంచునున్నట్లు ప్రకటించారు. కార్మిక, ఆరోగ్య శాఖ ఒప్పందం మేరకు 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందించనున్నట్లు తెలియజేశారు.
ఇటీవల ఆరోగ్య , కార్మిక శాఖ వైద్య సేవలపై చర్చించి ఒప్పందం కుదిరించినట్లు తెలిపారు. ఐదు లక్షల రూపాయల వరకు ప్రభుత్వ , ప్రైవేటు ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు అందించనున్నట్లు తెలిపారు. క్యాన్సర్, గుండె జబ్బులకు 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ సేవలు అందేలా ఆగస్టు నుంచి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ALSO READ :
1. Restarent : ఆ రెస్టారెంట్ లో తినాలంటే నాలుగేళ్ల ముందే బుక్ చేసుకోవాలంట.. స్పెషల్ ఏంటో..?
2. Womens : నిరుపేద మహిళలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు..!
3. Chicken : చికెన్ కిలో రూ.100 మాత్రమే.. గంటలోనే అన్ని షాపుల్లో ఖాళీ..!