PhonePe : ఫోన్ పే గుడ్ న్యూస్.. కేవలం రూ.49 తో రూ. లక్ష..!

ఫోన్ పే మీకు శుభవార్త అందించింది. కేవలం 49 రూపాయలతో లక్ష రూపాయల ప్రయోజనం లభిస్తుంది. అది ఎలా అంటే..?

PhonePe : ఫోన్ పే గుడ్ న్యూస్.. కేవలం రూ.49 తో రూ. లక్ష..!

మనసాక్షి , వెబ్ డెస్క్ :

ఫోన్ పే వినియోగదారులకు శుభవార్త అందించింది. కేవలం 49 రూపాయలతో లక్ష రూపాయల ప్రయోజనం అందనున్నది. అది ఎలా అంటే..? ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని భావించే వారికి ఇది ఒక గుడ్ న్యూస్ . అదిరిపోయే పాలసీ అందుబాటులో ఉంది. తక్కువ ధరకే అధిక ప్రీమియంతో మీరు ఈ పాలసీని తీసుకోవచ్చును. ఎలా అంటే ఫోన్ పే అందిస్తున్న ఈ సర్వీస్ ల గురించి తెలుసుకోవాల్సిందే.

 

ఫోన్ పే కూడా యూజర్లకు గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తుంది. తక్కువ ప్రీమియం తోనే ఎక్కువ బీమా కవరేజ్ సొంతం చేసుకోవచ్చు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీలు ఫోన్ పే లో అందుబాటులో ఉన్నాయి.

 

ప్రమాదవశాత్తు మరణిస్తే బీమా మొత్తం నామినీకి చెందే విధంగా ఉంటుంది. ఎలాంటి హెల్త్ చెకప్ లు అవసరం లేదు. ఈ పాలసీని తీసుకోవచ్చును. తక్కువ డాక్యుమెంట్లతోనే ఈ పాలసీని పొందే అవకాశం ఉంది. ఈ పాలసీ 24 గంటలు సేవలు అందుబాటులో ఉంటాయి.

 

మరణించినా.. కంటి చూపు కోల్పోయినా.. శాశ్వత అంగవైకల్యం కలిగినా .. భీమా మొత్తం పూర్తిగా లభిస్తుంది. 18 నుంచి 65 సంవత్సరాల వయసు కలిగిన వారు ఈ పాలసీని తీసుకోవచ్చును. ఆత్మహత్య చేసుకొని మరణిస్తే ఈ పాలసీ వర్తించదు. అదేవిధంగా యుద్ధంలాంటి వాటిలో మరణించినా కూడా ఈ పాలసీ డబ్బులు అందవు. డ్రగ్స్, లిక్కర్, తీసుకొని చనిపోయినా కూడా ఈ పాలసీ వర్తించదు.

 

ఫోన్ పే “రిలయన్స్” జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో ఈ పాలసీని అందజేస్తుంది. ప్రతి సంవత్సరం ఈ పాలసీని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాలసీ తీసుకున్న 15 రోజులు ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది. వద్దనుకుంటే తిరిగి వెనక్కి తీసుకోవచ్చును.

 

ALSO READ : 

  1. Murder : రూ 50 వేల సుపారి, రూ. 5 వేల అడ్వాన్స్.. జంట హత్యలు..!
  2. Vande Bharath : తెలంగాణకు మరో వందేభారత్.. ఏడు గంటల్లోనే గమ్యం..!
  3. TS TET NOTIFICATION : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల..!
  4. WhatsApp : వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. అదిరిపోయే ఫీచర్ మరొకటి..!

 

50 వేల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు మొత్తం తో యాక్సిడెంట్ పాలసీ తీసుకునే అవకాశం ఉంది. రూ. 50 వేల పాలసీ మొత్తానికి ప్రీమియం 20 రూపాయలు చెల్లించాలి. లక్ష రూపాయల పాలసీకి 49 రూపాయల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఐదు లక్షల బీమాకైతే 249 రూపాయలు చెల్లించాలి. 10 లక్షల రూపాయల బీమాకు 549 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 20 లక్షల బీమా పాలసీకి 1099 రూపాయలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

 

ఈ పాలసీలలో మీకు నచ్చిన పాలసీని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. కుటుంబ ఆర్థిక భద్రత కల్పించడానికి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంతో ఉత్తమమైనది చెప్పవచ్చును.