TS TET NOTIFICATION : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల..!

TS TET NOTIFICATION : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల..!

హైదరాబాద్, మనసాక్షి :

ఉపాధ్యాయ ఉద్యోగార్దులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త తెలియజేసింది. ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత ఉండాల్సిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నోటిఫికేషన్ మంగళవారం విడుదల చేసింది. ఈ పరీక్ష సెప్టెంబర్ 15వ తేదీన నిర్వహించనున్నారు. టెట్ కు పేపర్ -1, పేపర్ -2 పరీక్షలు నిర్వహించనున్నారు. రేపటి నుంచి (ఆగస్టు రెండవ తేదీ నుంచి 16వ తేదీ వరకు) టెట్ పరీక్షకు ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు.

 

డీఈడి , బీఈడి అభ్యర్థులు ఇద్దరు పేపర్ -1 పరీక్ష రాసుకునే అవకాశం ఉంది . బీఈడి అర్హత ఉన్న అభ్యర్థులు పేపర్ -1 తో పాటు పేపర్ -2 కూడా రాసుకునే అవకాశాన్ని కల్పించారు. టెట్ పరీక్ష నిర్వహణకు మంత్రివర్గ ఉప సంఘం ఆమోదం తెలిపింది. కాగా టెట్ నిర్వహణపై అధికారులు కసరత్తులు నిర్వహించి విద్యాశాఖ కార్యదర్శి కరుణకు అందజేశారు. ప్రతిపాదనలను విద్యాశాఖ ఆమోదించడంతో టెట్ నిర్వహణపై నోటిఫికేషన్ విడుదల చేశారు.

 

టెట్ పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు :

> ఆగస్టు రెండవ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభం.

> ఆగస్టు 16వ తేదీ దరఖాస్తులకు చివరి తేదీ.

> సెప్టెంబర్ 15 రాత పరీక్ష .

> ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ -1 పరీక్ష.

> మధ్యాహ్నం 2. 30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ -2 పరీక్ష.

> పరీక్ష ఫీజు 400 రూపాయలు.

> ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ.

> వెబ్ సైట్ : https://tstet.cgg.gov.in

 

2 లక్షల మంది రాసే అవకాశం :

తాజా అంచనాల ప్రకారం తెలంగాణ టెట్ పరీక్షకు రెండు లక్షల మంది రాస్తారని అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలో 1.5 లక్షల మంది డీఈడి, 4.5 లక్షల మంది బీఈడీ అభ్యర్థులు ఉన్నారు. కాగా గతంలో టెట్ కు ఏడు సంవత్సరాల వ్యాలిడిటీ ఉండగా రెండు సంవత్సరాల క్రితం టెట్ వ్యాలిడిటీ వ్యవధిని జీవితకాలం పొడిగించారు. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు రెండు లక్షల మంది టెట్ క్వాలిఫై కాని వారు ఉన్నట్టు సమాచారం. వీరే కాకుండా కొత్తగా డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన వారు మరో 20 వేల మంది వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు.