Murder : రూ 50 వేల సుపారి, రూ. 5 వేల అడ్వాన్స్.. జంట హత్యలు..!
మొదటి భార్యనే ప్రధాన నిందితురాలు..

Murder : రూ 50 వేల సుపారి, రూ. 5 వేల అడ్వాన్స్.. జంట హత్యలు..!
మొదటి భార్యనే ప్రధాన నిందితురాలు..
హత్నూర, ఆగస్ట్ 03, మన సాక్షి:
జంట హత్యల కేసు మిస్టరీని చేదించిన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం లో జరిగింది. భార్యాభర్తలు హత్యకు గురికావడంతో పోలీసులు ఈ కేసు పై ప్రత్యేక దృష్టి సారించి చేదించినట్లు డిఎస్పి పురుషోత్తం రెడ్డి తెలిపారు గురువారం హత్నూర పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. వారు వెల్లడించిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
హత్నూర మండలం షేర్ ఖాన్ పల్లి శివారు అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా మృతి చెందిన మహిళ శవాన్ని గుర్తించిన పోలీసులు కట్టుకున్న బర్తే హత్య చేశాడని దర్యాప్తు చేపట్టి.. మృతురాలి సోదరి 50 వేలకు సుపారీ ఇచ్చి చంపించింది అని తేల్చారు. నర్సాపూర్ మండలం ఎల్లారెడ్డి గూడ జగ్గయ్య తండా కు చెందిన లక్ష్మణ్ బేబీని వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అనంతరం బేబీ సోదరీ అయినా భాష తో పరిచయం ఏర్పరచుకొని వివాహం చేసుకున్నాడు.
ALSO READ :
- కుక్క దాడికి గురైన బాలికకు తీవ్ర గాయాలు
- Telangana : తెలంగాణలో రైతు బీమా తరహాలోనే.. మరొకటి..!
- TS TET NOTIFICATION : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల..!
- Vande Bharath : తెలంగాణకు మరో వందేభారత్.. ఏడు గంటల్లోనే గమ్యం..!
- Atm Card : ఏటీఎం కార్డు వినియోగదారులకు ఆర్బీఐ కొత్త రూల్స్.. మారిన నిబంధనలు..!
రెండో భార్య భాష రావడంతో మొదటి భార్య బేబీని పట్టించుకోవడం మానేసాడని, దాంతో భర్తపై రెండో భార్య అయిన భాష పై కోపం పెంచుకున్న బేబీ సోదరుడి వరసైన బానోత్ వినోద్ తో కలిసి హత్యకు పథకం పన్నింది. తన భర్త అయిన లక్ష్మణ్, సోదరి భాషను హత్య చేయాలని వినోద్ కు 50 వేలకు సుపారీ ఇచ్చి 5 వేల రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చింది.
వినోద్ లక్ష్మణ్ భాషలను అడవి ప్రాంతాలకు తీసుకెళ్లి మద్యం తాగించి బండరాయితో లక్ష్మన్ను హత్య చేశాడు గమనించిన భాష నిలదీయడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో మెడ కోసి హత్య చేశాడు.అనంతరం మృతురాలి మెడలోని బంగారు పుస్తెలతాడు,కడియాలు, నగదుతో బైక్ పై పరారయ్యాడు.
మొదటగా మృతురాలి శవాన్ని గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టి కొద్ది దూరంలో గల భర్త శవాన్ని గుర్తించి కేసు చేదించారు. మెదక్ డిఎస్పి పురుషోత్తం రెడ్డి కేసు చేదించిన జిన్నారం సీఐ, హత్నూర ఎస్సై సిబ్బందిని అభినందించారు. ఈ కేసులో నిందితులను గుర్తించడానికి పోలీసు సీఐ వేణు కుమార్ లక్ష్మారెడ్డి, లక్ష్మయ్య ,మున్యా నాయక్ ,మధులకు, జిల్లా ఎస్పీ రమణ కుమార్ కు రివార్డ్ ప్రకటించినట్లు విలేకరుల సమావేశంలో డిఎస్పి వెల్లడించారు.