కుక్క దాడికి గురైన బాలికకు తీవ్ర గాయాలు

కుక్క దాడికి గురైన బాలికకు తీవ్ర గాయాలు

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రతినిధి, మనసాక్షి

కల్వకుర్తి కుక్క దాడిలో అనుశ్రీ అను బాలికకు తీవ్ర గాయాలైన సంఘటన ఐదో వార్డు తిమ్మరాశిపల్లిలో చోటుచేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కల్వకుర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

 

ALSO READ : 

TS TET NOTIFICATION : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల..!

 

బాలిక ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా ఈ ఘటన జరిగిందన్నారు. వార్డులో కుక్కలు స్వైర విహారం చేస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదని బాలిక కుటుంబ సభ్యులు వాపోయారు. కుక్కల బెడదను నివారించి ప్రజల ప్రాణాలు కాపాడాలని వారు అధికారులను కోరారు.