Suryapet : వట్టే జానయ్య ప్రధాన అనుచరుడు పిల్లలమర్రి ఉపేందర్ అరెస్ట్, రిమాండ్..!
Suryapet : వట్టే జానయ్య ప్రధాన అనుచరుడు పిల్లలమర్రి ఉపేందర్ అరెస్ట్, రిమాండ్..!
జానయ్య పై 9 కేసులు నమోదు
రూరల్ పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించిన డిఎస్పి పరికే నాగభూషణం
సూర్యాపేట రూరల్, మనసాక్షి :
ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ ప్రధాన అనుచరుడు బినామీ ప్రభుత్వ ఉపాధ్యాయుడు పిల్లలమర్రి ఉపేందర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ నాగభూషణం తెలిపారు.
సోమవారం జనగాం రోడ్డులోని రూరల్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. గాంధీనగర్ గ్రామానికి చెందిన ఉగ్గం బుచ్చి రాములు చివేముల మండలం ఐలాపురం గ్రామ శివారులో తన సొంత భూమిలో గల చేపల చెరువులో ఈనెల 8న రాత్రి వట్టే జానయ్య యాదవ్ పిల్లలమర్రి ఉపేందర్ తో పాటు మరికొంతమంది చేపల చెరువును లూటీ చేసి సుమారు 5 టన్నుల చేపలు పట్టుకుపోయినట్లు తెలిపారు.
ALSO READ :
- Tragedy : ఆ తండ్రికి కూతురు అంటే అమితమైన ప్రేమ.. అనారోగ్యంతో కూతురు మృతి.. ఆ తర్వాత తండ్రి కూడా..!
- Revanth Reddy : యావత్ తెలంగాణ గుండెచప్పుడు.. కేసీఆర్ కేల్ ఖతం – బీఆర్ఎస్ దుకాణ్ బంద్.. వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి కౌంటర్..!
- NTR COIN : ఎన్టీఆర్ చిత్రంతో వంద రూపాయల నాణెం.. నేడు విడుదల.. ముద్రించింది ఎక్కడో తెలుసా..?
- Suryapet : సూర్యాపేటలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది.. పోటా పోటీగా ధర్నాలు..!
ఉగ్గం బుచ్చి రాములు ఫిర్యాదు మేరకు చివ్వెంల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేసి సోమవారం ఉపేందర్ ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
ఇప్పటివరకు డీసీఎంఎస్ చైర్మన వట్టే జానయ్య యాదవ్ పై9 కేసులు నమోదైనట్లు డి.ఎస్.పి పరికే నాగభూషణం తెలిపారు. ఈ సమావేశంలో సూర్యాపేట రూరల్ సీఐ అశోక్ రెడ్డి, రూరల్ ఎస్సై సాయిరాం, చివ్వెంల ఎస్సై మధు తదితరులు పాల్గొన్నారు.









