Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

CPI : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం సమక్షంలో సీపీఐ లో భారీగా చేరికలు..!

గుర్రంపోడు మండల పరిధిలోని చామలేడు గ్రామం శనివారం రాత్రి రాజకీయంగా ఒక్కసారిగా వేడెక్కింది. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) బలోపేతమే లక్ష్యంగా జరిగిన ఒక భారీ బహిరంగ సభలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వందలాది మంది నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీ సీపీఐ నల్గొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, చామలేడు దోటి శ్రీను సమక్షంలో పార్టీలో చేరారు. నూతనంగా చేరిన వారికి ఎమ్మెల్సీ ఎర్ర కండువాలు కప్పి పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు.

CPI : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం సమక్షంలో సీపీఐ లో భారీగా చేరికలు..!

గుర్రంపోడు, మన సాక్షి:

గుర్రంపోడు మండల పరిధిలోని చామలేడు గ్రామం శనివారం రాత్రి రాజకీయంగా ఒక్కసారిగా వేడెక్కింది. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) బలోపేతమే లక్ష్యంగా జరిగిన ఒక భారీ బహిరంగ సభలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వందలాది మంది నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీ సీపీఐ నల్గొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, చామలేడు దోటి శ్రీను సమక్షంలో పార్టీలో చేరారు. నూతనంగా చేరిన వారికి ఎమ్మెల్సీ ఎర్ర కండువాలు కప్పి పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. నల్గొండ జిల్లా రైతాంగానికి సాగునీటి విషయంలో జరుగుతున్న అన్యాయంపై శాసనమండలిలో గళం విప్పుతానని స్పష్టం చేశారు.పేదలు, కార్మికులు మరియు బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాడేది ఎర్రజెండా మాత్రమేనని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీగా తన ఎన్నిక కేవలం పదవి కోసం కాదని, ప్రజల గొంతుకను చట్టసభల్లో వినిపించేందుకని తెలిపారు. 2025 మార్చిలో ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పటి నుండి జిల్లాలోని మౌలిక వసతులు, బస్సు సర్వీసుల పునరుద్ధరణ వంటి ప్రజా సమస్యలపై నిరంతరం దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. చామలేడు గ్రామంలో యువత మరియు రైతులు ఇంత పెద్ద సంఖ్యలో పార్టీలో చేరడం జిల్లాలో సీపీఐకి ఉన్న ప్రజాధరణకు నిదర్శనమని పార్టీ మండల నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి సీపీఐ నాయకులు, మండల కార్యదర్శి, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు పార్టీ కార్యకర్తలు దోటి శ్రీను, సిలువేరు యాలాద్రి, పగిడిమర్రి బిక్షపతి,దాము లింగస్వామి, ఆవుల సైదులు, జక్కల శ్రీకాంత్, దోటి తరుణ్, పగడాల ముత్యం, పగడాల అంతమ్మ,పగడాల రమేష్, దోటి వల్లమ్మ , పగిడిమర్రి కవిత, పగడాల నరసింహ, సంగెం విష్ణు, కట్ట నాగరాజు, కొప్పోజు శంకరాచార్య, పగడాల కిరణ్, కట్ట నాగరాజు, పగిడిమర్రి రాములమ్మ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు