అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఆర్థికపరమైన విషయాల్లో పలు మార్పులు.. అవి ఏంటో తెలుసుకుందాం..!
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఆర్థికపరమైన విషయాల్లో పలు మార్పులు.. అవి ఏంటో తెలుసుకుందాం..!
హైదరాబాద్, మనసాక్షి :
మరో ఐదు రోజుల్లో ఈ నెల (సెప్టెంబర్) మూగినున్నది. అక్టోబర్ నెల మొదలుకానున్నది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆర్థికపరమైన విషయాల్లో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. డిమ్యాట్ ఖాతాలు, సేవింగ్స్ అకౌంట్, మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు, 2000 రూపాయల నోట్ల మార్పిడి వంటి అంశాలకు ఈనెల సెప్టెంబర్ 30వ తేదీ డెడ్ లైన్ గా ఉంది.
ఈ 30వ తేదీతో పలు అంశాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రాబోతున్నాయి.. అవేంటో తెలుసుకుందాం.. అంతర్జాతీయ చెల్లింపుల విషయంలో కూడా అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి టాక్స్ 20 శాతానికి పెరగనున్నది.
🟢 మ్యూచువల్ ఫండ్ :
మ్యూచువల్ ఫండ్ కడుతున్నవారు ఈనెల 30వ తేదీ లోపు నామినీ పేర్లను జత చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి నామిని పేర్లను జత చేయడం కుదరదు. ఇప్పటికే మార్చి 31వ తేదీ గడువు ముగిసినప్పటికీ తిరిగి సెప్టెంబర్ 30వ తేదీగా గడువు పొడిగించారు. ఈనెల 30వ తేదీ లోపు నామిని పేరును జత చేయాల్సి ఉంటుంది.
తమకు నామిని అవసరం లేదని భావిస్తే డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. లేకపోతే ఆ ఫోలియోలు ఫ్రీజ్ లో ఉంటాయి. అందువల్ల ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడి దానిపై వచ్చే రావడానికి తిరిగి పొందటం చాలా కష్టమవుతుంది.
🟢 అంతర్జాతీయ చెల్లింపులపై టాక్స్ :
అంతర్జాతీయ చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వం విధించే టిసిఎస్ టాక్స్ ప్రస్తుతం ఐదు శాతం వరకు మాత్రమే ఉంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆ టాక్స్ 20% కాబోతుంది. ఆర్థిక సంవత్సరంలో 7 లక్షల పరిమితికి మించి ఖర్చు చేసిన వారు వారి మూలధనంలో 20 శాతం టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. విద్య ,వైద్యం సంబంధిత చెల్లింపులకు మాత్రం పాత పద్ధతిలోనే పన్ను చెల్లిస్తారు. రియల్ ఎస్టేట్, బాండ్లు , విదేశీ స్టాక్ మార్కెట్లు, టూర్ ప్యాకేజీలు, విదేశీయులకు పంపే బహుమతులు వంటి వాటికి ఖర్చు చేస్తే మాత్రం టాక్స్ పడనున్నది.
🟢 సేవింగ్స్ అకౌంట్ :
అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అన్ని స్మాల్ సేవింగ్స్ ఖాతాలకు ఆధార్ కార్డు తప్పనిసరి కానున్నది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాలు కలిగిన వారు ఈ నెలాఖరులోగా కచ్చితంగా ఆధార్ కార్డును అందజేయాల్సి ఉంది. లేకపోతే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఈ ఖాతాలో స్తంభిస్తాయి.
ALSO READ : Software : ఈ కోర్సులు నేర్చుకుంటే సాఫ్ట్ వేర్ ఉద్యోగం గ్యారెంటీ.. అవేంటో తెలుసుకుందాం..!
🟢 ట్రేడింగ్ ఖాతాలు, డిమార్ట్ ఖాతాలు :
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారు కూడా తమ డిమ్యాట్ ఖాతాలు, ట్రేడింగ్ ఖాతాలను ఈ నెలాఖరులోగా నామిని పేర్లను జత చేయాల్సి ఉంటుంది. గడువు దాటితే జత చేయడం వీలుకాదు. సెబీ సర్క్యులర్ ప్రకారం ఈ గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు మాత్రమే ఉంది.
🟢 2000 రూపాయల నోట్ల మార్పిడి :
కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయల నోటును రద్దు చేసిన విషయం తెలిసిందే. కానీ రెండు వేల రూపాయల నోట్లు కలిగి ఉన్నవారు ఈనెల 30వ తేదీ లోగా మార్చుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 2000 నోట్లను కలిగిన వారు చాలావరకు మార్పిడి చేసుకున్నారు. కానీ ఈ నెలాఖరులోపు కచ్చితంగా మార్చుకోవాల్సి ఉంది.
మరిన్ని వార్తలు :
- Ration Card : రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ – కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలా.. ఎలా, ఎక్కడ చేయించుకోవాలంటే..!
- Health News : బిపి పెరుగుతోంది.. ఎంత అనారోగ్యమో తెలుసా.. భారత్ లోనే పెరుగుతున్న బాధితులు..!
- Farmer Ganesh : వైరల్ అవుతున్న పొలం పనులు చేస్తున్న రైతు గణేశా.. ఫోటోలు..!
- Ts Rtc : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ దసరా కానుక.. టికెట్ పై రాయితీ, ఎప్పటినుంచంటే..!










