Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుటెక్నాలజీతెలంగాణహైదరాబాద్

Bank Balance : మీ బ్యాంకులో బ్యాలెన్స్ రూపాయి కూడా లేదా.. అయినా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు.. అది ఎలాగో తెలుసుకుందాం..!

Bank Balance : మీ బ్యాంకులో బ్యాలెన్స్ రూపాయి కూడా లేదా.. అయినా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు.. అది ఎలాగో తెలుసుకుందాం..!

మనసాక్షి : వెబ్ డెస్క్:

ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ యూపీఐ పేమెంట్స్ కు అలవాటు పడిపోయారు. గతంలో ఏటీఎం కార్డులను ఎక్కువగా ఉపయోగించి మనీ డ్రా చేసి పేమెంట్ చేసేవారు. ఇటీవల కాలంలో మనీ పేమెంట్స్ తగ్గిపోయాయి. ప్రతి చిన్న కొనుగోలుకు కూడా యూపీఐ ద్వారానే ఆన్‌లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. బ్యాంకులో రూపాయి కూడా లేకున్నా కూడా యూపీఐ చెల్లింపులు చేయడానికి గూగుల్ పే ని ఉపయోగించవచ్చును. అదెలాగో తెలుసుకుందాం..

రూపే క్రెడిట్ కార్డు హోల్డర్లు తమ బ్యాంకు ఖాతాలో డబ్బులు లేకపోయినా యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడానికి గూగుల్ పే ని ఉపయోగించవచ్చును. అది ఎలా అంటే..

ALSO READ : Software : ఈ కోర్సులు నేర్చుకుంటే సాఫ్ట్ వేర్ ఉద్యోగం గ్యారెంటీ.. అవేంటో తెలుసుకుందాం..!

బ్యాంకులు ఇప్పుడు యూపీఐ వినియోగదారులకు క్రెడిట్ లైన్ ఫీచర్ ని అందిస్తున్నాయి. ఈ ఫీచర్ ని ఉపయోగించడానికి బ్యాంకుతో క్రెడిట్ లైన్ కోసం సైన్ అప్ చేయాల్సి ఉంటుంది. అప్రూవ్ తర్వాత మీరు బ్యాంక్ బ్యాలెన్స్ తో పేమెంట్స్ చేసినట్లుగానే మీ క్రెడిట్ లైన్ ద్వారా పేమెంట్స్ చేయవచ్చును.

మీ బ్యాంక్ అకౌంట్ లో ఒక్క రూపాయి కూడా ఉండాల్సిన అవసరం లేదు. అయితే వినియోగదారులు గడువు తేదీకి ముందే క్రెడిట్ లైన్ ను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఉపయోగించిన మొత్తం గడువుకు ముందే తిరిగి బ్యాంకు ఖాతాలో వేయాల్సి ఉంటుంది. దీనిని ఎక్కువగా అత్యవసరమైన పరిస్థితుల్లోనే వాడుకుంటే వినియోగదారుడికి మంచిది.

మీరు ఉపయోగించే మొత్తం పై బ్యాంకు వడ్డీని వసూలు చేసే అవకాశం ఉంటుంది. హెచ్ డి ఎఫ్ సి (HDFC), ఐ సి ఐ సి ఐ (ICICI) బ్యాంకులు ఇప్పటికే యూపీఐ వినియోగదారులకు క్రెడిట్ లైన్ ను అందిస్తున్నాయి. దీనిని ఉపయోగించడం వల్ల HDFC బ్యాంకు రుసుము వసూలు చేస్తుంది. కానీ ICICI బ్యాంకు వసూలు చేయదు. ఈ రెండు బ్యాంకులకు కూడా క్రెడిట్ పరిమితి 50 వేల రూపాయల వరకు ఉంది.

ALSO READ : Ration Card : రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ – కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలా.. ఎలా, ఎక్కడ చేయించుకోవాలంటే..!

యూపీఐ క్రెడిట్ లైన్ దేశంలో వస్తుసేవల కోసం ప్రజలు చెల్లించే విధానంలో విప్లవాత్మక మార్పులు కొత్త ఫీచర్ ని యూపీఐ క్రెడిట్ లైన్ ను తీసుకువచ్చింది. ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ లైన్ నుంచి ఖర్చు చేయడానికి వినియోగదారులను అనుమతించడం ద్వారా యూపీఐ క్రెడిట్ లైన్లు బ్యాంకు ఖాతాలో డబ్బులు లేకపోయినా కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది.

అత్యవసరమైన పరిస్థితులు గాని, ఊహించని విధంగా ప్రత్యేకమైన ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు గానీ దీనిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తలు : 

మరిన్ని వార్తలు