Balapur Ganesh Laddu : రూ. 27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు.. వేలంపాటలో దక్కించుకున్న రియాల్టర్..!
Balapur Ganesh Laddu : రూ. 27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు.. వేలంపాటలో దక్కించుకున్న రియాల్టర్..!
హైదరాబాద్, మన సాక్షి :
హైదరాబాద్‌లో గణేష్ మహా శోభాయాత్ర ప్రారంభమైంది. నిమజ్జనానికి రాత్రి నుంచే గణనాథులు తరలివస్తున్నారు. దీంతో ట్యాంక్‌బండ్‌పై సందడి మొదలైపోయింది. ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర ప్రారంభమైంది. 63 అడుగుల ఎత్తులో శ్రీ దశమహా విద్యాగణపతిగా కొలువైన ఖైరతాబాద్ గణేశుడి శోభాయత్ర కోసం పకడ్బంధీ సాగుతుంది .
రూ. 27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు :
ఎంతో ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ గణేశుడి లడ్డు ఏడాది 27 లక్షల రూపాయలు పలికింది. వేలంపాటలో దాసరి దయానంద రెడ్డి దక్కించుకున్నారు. ఆయన గణేష్ లడ్డూ దక్కించుకోవడం ఇది రెండవసారి . బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాటపై ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూశారు.
వేలం పాటలో 35 మంది భక్తులు పాల్గొన్నారు. బాలాపూర్ లడ్డు వేలంపాటకు 30 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఏడాది 450 రూపాయల వేలంపాటతో మొదలైన లడ్డు వేలంపాట 27 లక్షలకు చేరింది. 1994లో బాలాపూర్ లడ్డూ వేలం పాట కేవలం 450 రూపాయలు మాత్రమే.
ALSO READ : హైదరాబాద్ : రికార్డ్ స్థాయిలో గణేష్ లడ్డు వేలంపాట.. రూ.1.26 కోట్లు, అది ఎక్కడంటే..!
కరోనా సమయంలో తప్ప 30 ఏళ్లపాటు ఈ వేలంపాట సాగుతూనే ఉంది. రికార్డ్ స్థాయిలో లడ్డు ధర పలుకుతూ కొన్న వారి కొంగు బంగారంగా నిలుస్తుంది. సుమారు 35 మంది స్థానికులు స్థానికేతరులు ఆ మధ్య వేలంపాట పోటా పోటీగా సాగింది. గత ఏడాది వేలంపాటలో 24 .60 లక్షల రూపాయలు పలికిన బాలాపూర్ లడ్డూను బాలాపూర్ ఉత్సవ సమితి సభ్యులు పొంగులేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు.
ఈ ఏడాది రియాల్టర్ దాసరి దయానంద్ రెడ్డి 27 లక్షలకు దక్కించుకున్నారు. 2021 లో బాలాపూర్ లడ్డు 18 లక్షలు పలికింది. 2022లో 5.70 లక్షలు మాత్రమే పలికింది.









