హైదరాబాద్ : రికార్డ్ స్థాయిలో గణేష్ లడ్డు వేలంపాట.. రూ.1.26 కోట్లు, అది ఎక్కడంటే..!

హైదరాబాద్ : రికార్డ్ స్థాయిలో గణేష్ లడ్డు వేలంపాట.. రూ.1.26 కోట్లు, అది ఎక్కడంటే..!

హైదరాబాద్, మనసాక్షి :

గతంలో ఎన్నడు లేని విధంగా హైదరాబాద్ నగరంలో గణేష్ లడ్డూల వేలం పాట పెరిగింది. రికార్డ్ స్థాయిలో 1.26 కోట్ల రూపాయలకు గణేష్ లడ్డూ వేలం పాటలో ఓ భక్తుడు దక్కించుకున్నాడు. హైదరాబాద్ నగరంలో నిమజ్జన శోభాయాత్ర వైభవంగా కొనసాగుతుంది.

మరోవైపు లడ్డూల వేలం పాట ప్రక్రియ కూడా జోరుగా సాగుతుంది. గణపతి ప్రసాదాన్ని సొంతం చేసుకోవడానికి వేలంపాటలో భక్తులు పోటీ పడుతున్నారు. ఎన్ని కోట్ల రూపాయలు హెచ్చించి అయినా కూడా లడ్డు ప్రసాదాన్ని దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు.

హైదరాబాదులోని బండ్లగూడ జాగిర్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాలో గణపతి లడ్డు రికార్డు వస్తాయి ధర పలికింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ వేలం పాటలో 1.26 కోట్ల రూపాయల పలికింది. గత ఏడాది ఇక్కడ లడ్డు వేలం పాట 60.80 లక్షలు పలికింది.

అయితే ఈసారి మాత్రం ధర రెట్టింపయింది. 2021లో ఇక్కడ గణపతి లడ్డు వేలం పాట 41 లక్షలు గా పలికిందని స్థానికులు పేర్కొంటున్నారు.

ALSO READ : Ganesh Shobhayathra : మొదలైన గణేష్ శోభాయాత్ర.. 450 రూపాయలతో మొదలై 24 లక్షలకు చేరిన వేలం పాట.. అందరి దృష్టి లడ్డువేలం పాటపై ..!