Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : పేకాట స్థావరంపై దాడి.. ఇద్దరు అరెస్టు..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించగా ఇద్దరిని అరెస్టు చేశారు.

Miryalaguda : పేకాట స్థావరంపై దాడి.. ఇద్దరు అరెస్టు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించగా ఇద్దరిని అరెస్టు చేశారు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలంలోని దుర్గా నగర్ లో ఒక షట్టర్ వెనకల పేకాట ఆడుతున్న సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. కాగా ఇద్దరిని అరెస్ట్ చేయగా ముగ్గురు పారిపోయారు. వారి వద్ద నుంచి 12,580 నగదు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.









