Miryalaguda : మిర్యాలగూడలో ఎరువులు, విత్తనాల దుకాణాల్లో అధికారుల ఆకస్మిక తనిఖీలు..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో ఎరువులు, విత్తనాల దుకాణాలను వ్యవసాయ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయ అధికారి ఏం. రుషేంద్రమని దుకాణాల్లో రికార్డులను పరిశీలించారు.

Miryalaguda : మిర్యాలగూడలో ఎరువులు, విత్తనాల దుకాణాల్లో అధికారుల ఆకస్మిక తనిఖీలు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో ఎరువులు, విత్తనాల దుకాణాలను వ్యవసాయ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయ అధికారి ఏం. రుషేంద్రమని దుకాణాల్లో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని దుకాణాల్లో పూర్తిస్థాయి తనిఖీ నిర్వహిస్తున్నామన్నారు.
లూజు విత్తనాలు, నాణ్యతలేని విత్తనాలను అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోలు చేసిన ప్రతి రైతు రశీదు తీసుకోవాలని సూచించారు. అన్ని రకాల విత్తనాల దిగుబడి ఒకే రకంగా ఉంటుంది. రైతులు కొన్ని రకాల విత్తనాలే అధిక దిగుబడి వస్తాయనే అపోహ పడకుండా అందుబాటులో ఉన్న విత్తనాలను విత్తుకోవాలి. లైసెన్స్ ఉన్న షాపుల్లోనే విత్తనాలు కొనాలి.
రశీదులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. అధిక ధరలకు అమ్మితే డీలర్లపై చర్యలు తీసుకుంటాం అని వివరించారు. ఈ కార్యక్రమములో మిర్యాలగూడ ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు, వ్యవసాయ విస్తరణ అధికారి షఫి ఉన్నారు.









