Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం

Miryalaguda : రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు..!

తెలంగాణా వ్యవసాయశాఖ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది.

Miryalaguda : రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

తెలంగాణా వ్యవసాయశాఖ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా కంపసాగర్ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వి. శ్రీధర్ మాట్లాడుతూ రైతులు పచ్చిరొట్ట పైర్లను సాగుచేసి, పూతదశలో భూమిలో కలిరుదున్ని భూసారాన్ని పెంపొందించడంతో పాటు యూరియా వాడకాన్ని తగ్గించాలని సూచించారు. మార్కెట్ డిమాండ్ ఉన్న వరిరకాలను సాగుచేయాలని హచించారు.

కేృషి విజ్ఞాన కేంద్రం, కంపాసాగర్ ఉద్యానవన శాస్త్రవేత్త హిమబిందు రైతులకు పంటమార్పిడి ఆవశ్యకతను వివరించారు. సేంద్రీయ పద్ధతులద్వారా కూరగాయల సాగు మరియు పంట వైవిధ్యకరణపై అవగాహన కల్పించారు. విచక్షణారహితంగా రసాయినాలను వ్యవసాయంలో వాడటం ద్వారా కలిగే దుష్పరిమాణాలను వివరించి రైతులు సేంద్రియ పద్ధతిలో సాగు ఎలా చేయాలో వివరించారు.

గ్రామ సర్పంచ్ కె. చంద్రశేఖర్, మాతంగిరవి ( ఉపసర్పంచి ) రైతులు శాస్త్రవేత్తల సూచనలు పాటించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ గోపి, సర్పంచ్, ఉప సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి, శేఖర్ రెడ్డి, అభ్యుదయ రైతులు, అరుణ, వసంత పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు