Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండసంక్షేమం

Miryalaguda : మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కీలక ప్రకటన.. పూరి గుడిసెలు లేని గ్రామాలను చూడడమే నా లక్ష్యం..! 

మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామపంచాయతీ లో నూతన ఇందిరమ్మ ఇళ్ళు గృహప్రవేశంలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. లబ్దిదారుల కుటుంబ సభ్యులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం లబ్దిదారులను షాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు.

Miryalaguda : మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కీలక ప్రకటన.. పూరి గుడిసెలు లేని గ్రామాలను చూడడమే నా లక్ష్యం..! 

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామపంచాయతీ లో నూతన ఇందిరమ్మ ఇళ్ళు గృహప్రవేశంలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. లబ్దిదారుల కుటుంబ సభ్యులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం లబ్దిదారులను షాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ సందర్భంగా లబ్ధి దారులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల సొంత ఇంటికలను నెరవేర్చిన ప్రజా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే బి ఎల్ ఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల ఆత్మగౌరవం కోసం పని చేస్తోంది అన్నారు. గత పదేళ్లుగా ఇల్లు లేక ఇబ్బందులు పడ్డ నిరుపేదలకు ఈ రోజు శాశ్వత నివాసం లభించిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుడికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తూ వారి సొంతింటి కలను సాకారం చేస్తోంది అన్నారు.

పార్టీలు, కులాలకు అతీతంగా కేవలం అర్హతనే ప్రాతిపదికగా తీసుకుని ఇళ్లను మంజూరు చేస్తున్నామని, నియోజకవర్గంలో 3500 ఇళ్లను మంజూరు చేశామని, ఇంకా మిగిలిన అర్హులైన వారికి కూడా త్వరలోనే ఇళ్లు అందిస్తాం అన్నారు. నియోజకవర్గంలో పూరి గుడిసెలు, పాత మట్టి మిద్దెలు లేని రోజును చూడాలన్నదే నా ఆశయం అన్నారు. ప్రతి ఒక్కరికీ గూడు, నీడ కల్పించడమే ఈ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి, స్కైలాబ్ నాయక్ గుండు నరేందర్, గ్రామ సర్పంచ్ మేక సైదులు, ఉప సర్పంచ్ కుసుమ సుదర్శన్ రెడ్డి, నాయకులు అంతిరెడ్డి, లింగారెడ్డి, సైదులు, బత్తుల వెంకటరెడ్డి, నంద్యాల జన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు