Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు వేగవంతం చేయాలి..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం గుమస్తాల కాలనీలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీ ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.

Miryalaguda : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు వేగవంతం చేయాలి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం గుమస్తాల కాలనీలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీ ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ఆయన గుమస్తాల కాలనీలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభ ఏర్పాట్లను పరిశీలించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీకి వచ్చే ప్రధాన రోడ్డుకు ఇరువైపులా చెత్తా,చెదారం, చెట్ల తొలగింపు తో పాటు, రోడ్డును డోజర్ తో గుంతలు పూడ్చి సమాంతరం చేయాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కాలనీలోని డ్రైన్లు త్రీఫేజ్ పవర్, ప్రతి ఇంటికి ఎర్తింగ్, కరెంట్ మీటర్లు ఏర్పాటు చేసేలా చూడాలని ఆర్ అండ్ బి ఎస్ ఈ శ్రీధర్ రెడ్డిని ఆదేశించారు. ప్రతి ఇంటిపై వాటర్ ట్యాంకులకు నీటిని ఎక్కించి నీటి సరఫరాను పరిశీలించాలని, అలాగే ప్రతి ఇంట్లో వైరింగ్ తో పాటు, ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. అన్ని పనులు వేగంగా పూర్తి చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. బుధవారంలోగా వాటర్ ట్యాంకులను నీటితో నింపడం ,ప్రతి ఇంటికి నీటి సరఫరాను తనిఖీ చేయడం పూర్తి చేయాలన్నారు.

అలాగే ప్రతి ఇంట్లో టాప్ కనెక్షన్ తో పాటు, బల్బులు, ఇతర సౌకర్యాలు చూడాలన్నారు. ఎక్కడా ఓపెన్ డ్రైనేజీ ఉండడం, పైపులు పగిలిపోవడం లేదా భవిష్యత్తులో సమస్యలు వచ్చేలా ఉండకుండా చూడాలని ఆదేశించారు.

రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కాలనీ ప్రారంభానికి హాజరుకానున్న దృష్ట్యా అవసరమైన అన్ని ఏర్పాట్లన్నీ చూడాలని, అలాగే ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే సభా వేదిక, ఇతర ఏర్పాట్లను కూడా చేయాలని , అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.

గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, ఆర్ అండ్ బి ఎస్ ఈ శ్రీధర్ రెడ్డి, మిర్యాలగూడ ఇన్చార్జ్ సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్, మున్సిపల్, ఇతర అధికారులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.

మరిన్ని వార్తలు