YS Sharmila : షర్మిల పాలేరులో పోటీ చేస్తుందా.. కాంగ్రెస్ కు మద్దతిస్తుందా..!
YS Sharmila : షర్మిల పాలేరులో పోటీ చేస్తుందా.. కాంగ్రెస్ కు మద్దతిస్తుందా..!
హైదరాబాద్, మన సాక్షి :
తెలంగాణలో వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల పాలేరు నుంచి పోటీ చేస్తుందా..? లేదా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తుందా..? అనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఎన్నికల్లో వైయస్సార్ తెలంగాణ పార్టీ అన్ని నియోజకవర్గాలలో పోటీ చేయనున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో విలీనం గురించి చర్చలు నిర్వహించినా.. విప్లమయ్యాయి. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించడంతోపాటు బీఫాముల కోసం దరఖాస్తులు కూడా స్వీకరించింది.
ఆ సమయంలో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహించి తాను పాలేరు నుంచి పోటీ చేయనున్నట్లు వైయస్ షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం పాలేరు నియోజకవర్గంలో వైఎస్ కుటుంబానికి ఆప్తమిత్రుడుగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో నిలుచున్నారు.
కాగా వైఎస్ షర్మిల పాలేరు నుంచి పోటీ చేస్తాను అని ప్రకటించినప్పటికీ ఆమె కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేస్తుందా..? లేదా..? వైయస్సార్ తెలంగాణ పార్టీ నుంచి పాలేరు బరిలో ఉంటుందా..? అనేది చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేయాలని కాంగ్రెస్ నేతలు ఆమెను కలిసి కోరే అవకాశం ఉంది. దాంతో ఆమె పోటీలో ఉంటుందా..? విరమించుకుంటుందా..? అనే అంశం తేలాల్సి ఉంది.
ALSO READ : BIG BREAKING : కాంగ్రెస్ తో సిపిఎం పొత్తు విఫలం.. ఒంటరిగా పోటీకి సిద్ధమైన సిపిఎం..!









