మాడ్గులపల్లి : ట్రాక్టర్ పై నుండి పడి వ్యక్తి దుర్మరణం.. మిర్యాలగూడ లో వడ్లు అమ్ముకొని తిరిగి వస్తుండగా ప్రమాదం..!

ట్రాక్టర్ పై నుండి కింద పడి వ్యక్తి చనిపోయిన ఘటన మాడ్గులపల్లి మండల పరిధిలో లో జరిగింది.

మాడ్గులపల్లి : ట్రాక్టర్ పై నుండి పడి వ్యక్తి దుర్మరణం.. మిర్యాలగూడ లో వడ్లు అమ్ముకొని తిరిగి వస్తుండగా ప్రమాదం..!

మాడుగుల పల్లి, మన సాక్షి

ట్రాక్టర్ పై నుండి కింద పడి వ్యక్తి చనిపోయిన ఘటన మాడ్గులపల్లి మండల పరిధిలో లో జరిగింది. మాడ్గులపల్లి ఎస్ఐ కె.నరేష్ తెలిపిన వివరాల ప్రకారం..  తిప్పర్తి మండలం ఎల్లమ్మ గూడెం గ్రామం కు చెందిన ముక్కముల సైదులు (33) బుదవారం ఉదయం TS 05 UC 8112 నెంబర్ గల తన స్వంత ట్రాక్టర్ పై ధాన్యం లోడ్ వేసుకొని, మిర్యాలగూడ మిల్లు లో వడ్లు అమ్ముకొని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.

మార్గ మధ్యలో గుర్రప్ప గూడెం స్టేజి వద్దకు వచ్చే సారికి ట్రాక్టర్ అదుపు తప్పి క్రింద పడిపోతుండగా, భయం తో ట్రాక్టర్ పై నుండి దూకగా తీవ్రగాయాలు కాగా, చికిత్స నిమిత్తం నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు .

మృతుడి భార్య ఇచ్చిన పిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని మాడ్గులపల్లి ఎస్ఐ తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఒక్క పాప, ఒక్క బాబు సంతానం కలరు.

ALSO READ : BIG BREAKING : కాంగ్రెస్ తో సిపిఎం పొత్తు విఫలం.. ఒంటరిగా పోటీకి సిద్ధమైన సిపిఎం..!