కాంగ్రెస్ కి జై కొట్టిన వైఎస్ షర్మిల.!
కాంగ్రెస్ కి జై కొట్టిన వైఎస్ షర్మిల.!
హైదరాబాద్ , మన సాక్షి :
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇవ్వనున్నట్లు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల కూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు .
అవినీతి, అక్రమ పాలన అటతం చేసేందుకు మద్దతు తెలియజేస్తున్నానని చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే కేసీఆర్ సీఎం అవుతారని.. అందుకే కాంగ్రెస్ కు మద్దతు తెలియజేసినట్లు ఆమె తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్టు ఓ పెద్ద జోక్ అని మేడిగడ్డ బ్యారేజీ తెలియజేసిందన్నారు.
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం అనే విషయం సులువైన విషయం కాదు. ఈ విషయం బాధ కలిగించినప్పటికీ.. కెసిఆర్ సీఎం కాకూడదని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నానని ఆమె తెలిపారు. నా నిర్ణయానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు ఏకీభవిస్తారని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు.









