Breaking NewsTOP STORIESజాతీయంతెలంగాణరాజకీయం

సీఎం గా రేవంత్ రెడ్డి పేరు ఖరారు.. హై కమాండ్ స్పష్టం..!

సీఎం గా రేవంత్ రెడ్డి పేరు ఖరారు.. హై కమాండ్ స్పష్టం..!

ఢిల్లీ బయలుదేరిన రేవంత్

న్యూఢిల్లీ, మన సాక్షి :

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఖరారు చేసింది. ఢిల్లీలోని కేసి వేణుగోపాల్ నివాసంలో మాణిక్రావు టాక్రే, డీకే శివకుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.

సమావేశంలో ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కేసు వేణుగోపాల్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పేరును కొత్త సీఎల్పీ లీడర్ గా ప్రకటించారు. రేవంత్ రెడ్డిని డైనమిక్ లీడర్ గా వేణుగోపాల్ పేర్కొన్నారు.

సీఎం గా ప్రమాణస్వీకారం అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని మరోసారి హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా హైదరాబాదులోని ఎల్లా హోటల్లో ఉన్న రేవంత్ రెడ్డి హై కమాండ్ పిలుపు మేరకు ఢిల్లీ బయలుదేరారు. బేగంపేటలోని ప్రత్యేక విమానంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు.

ALSO READ : ముగిసిన సీఎల్పీ సమావేశం.. అధిష్టానమే తుది నిర్ణయం, ఆయన వేపే మొగ్గు..!

రాహుల్ తో భేటీ అనంతరం స్పష్టమైన కామెంట్ :

ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ , రాహుల్ గాంధీ , ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున కర్గేతో మంగళవారం సమావేశం అయ్యారు.

తెలంగాణ సీఎం నియామకంపై పూర్తిస్థాయిలో చర్చించారు. కాగా రాహుల్ గాంధీ ఈ విషయంపై శ్రద్ధ వహించి రేవంత్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి పేరును కేసి వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు.

ALSO READ : సీనియర్ కాంగ్రెస్ నేతలతో డీకే భేటీ.. సీఎం , మంత్రులు వారే..!

మరిన్ని వార్తలు