సీనియర్ కాంగ్రెస్ నేతలతో డీకే భేటీ.. సీఎం , మంత్రులు వారే..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం భేటీ అయ్యారు.

సీనియర్ కాంగ్రెస్ నేతలతో డీకే భేటీ.. సీఎం , మంత్రులు వారే..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం భేటీ అయ్యారు. హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్లో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి , పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క, సీనియర్ నాయకులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో భేటీ అయ్యారు.

ముఖ్యమంత్రి అభ్యర్థిపై చర్చించారు. సిఎల్పీ సమావేశానికి ముందుగానే సీనియర్ నాయకులతో సమావేశమై ఎలాంటి పేచీ లేకుండా చర్చించినట్లు సమాచారం.

ALSO READ : రేవంత్ రెడ్డిది ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ.. ఆయన రాజకీయం టిఆర్ఎస్ తోనే ప్రారంభం.. సోషల్ మీడియాలో వైరల్..!

సీఎం మంత్రివర్గంపై కొలిక్కి :

సీఎల్పీ సమావేశంలో సీఎల్పీ లీడర్ ని ఎన్నుకునే విషయంతో పాటు మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పించాలని కూడా ఈ భేటీలో చర్చి చర్చించినట్లు సమాచారం. సామాజిక వర్గాల వారీగా మంత్రివర్గంలో చోటు కల్పించడంతోపాటు ఉప ముఖ్యమంత్రి , హోం మంత్రి లాంటి కీలకమైన పదవులు ఎవరికి ఇవ్వాలనే విషయాన్ని చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.

ALSO READ : ప్రగతి భవన్ కాదు, ప్రజా భవన్.. ఆరుగ్యారెంటీలతో పాటు మరో హామీ.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!