రేవంత్ రెడ్డిది ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ.. ఆయన రాజకీయం టిఆర్ఎస్ తోనే ప్రారంభం.. సోషల్ మీడియాలో వైరల్..!

తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలను మార్చేసిన వ్యక్తి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనకు అంతం పలికిన తిరుగులేని నాయకుడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కి చెమటలు పట్టించేలా చేశారు.

రేవంత్ రెడ్డిది ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ.. ఆయన రాజకీయం టిఆర్ఎస్ తోనే ప్రారంభం.. సోషల్ మీడియాలో వైరల్..!

హైదరాబాద్ , మన సాక్షి :

తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలను మార్చేసిన వ్యక్తి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనకు అంతం పలికిన తిరుగులేని నాయకుడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కి చెమటలు పట్టించేలా చేశారు. ఓటుకు నోటు కేసులో తనను ఇరికించారని, జైలుకు పంపారని ఆరోపించిన రేవంత్ రెడ్డి గోడకు కొట్టిన బంతిలా ఎదిగి కాంగ్రెస్ పార్టీలో చేరి తన సత్తా ఏందో నిరూపించుకున్నాడు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నాడు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. సినిమా స్టైల్ లో రేవంత్ రెడ్డి లవ్ స్టోరీ ఉండడం గమనార్హం.

విద్యార్థి ఉద్యమ నాయకుడు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన రేవంత్ రెడ్డి ప్రేమ వివాహం ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా మారింది. స్టూడెంట్ గా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి ఏబీవీపీ లీడర్ గా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ లో పలు కార్యక్రమాలను ఉద్యమాలను నిర్వహించారు. విద్యార్థి నాయకుడిగా అనేక కార్యక్రమాలు చేశారు. విద్యార్థులను ఉద్యమం వైపు నడిపించారు.

ALSO READ : తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి రేపే ప్రమాణ స్వీకారం

ఆ సమయంలో అప్పటి మాజీ మంత్రి , కాంగ్రెస్ పార్టీ నాయకులు సూదిని జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురు గీతారెడ్డి రేవంత్ రెడ్డి పై మనసు పడింది. రేవంత్ రెడ్డి స్టూడెంట్ లీడర్ గా ఉన్న సమయంలోనే ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత జైపాల్ రెడ్డి తమ్ముడికి విషయం తెలిసింది. రేవంత్ రెడ్డికి తన కూతురిని ఇచ్చి వివాహం చేయడం తనకు ఇష్టం లేదు. దాంతో ఢిల్లీలో ఉన్న జైపాల్ రెడ్డి వద్దకు తన కూతురిని పంపించాడు.

అప్పటికే ఇద్దరు ప్రేమించుకోవడం వల్ల రేవంత్ రెడ్డి తగ్గకుండా ఆమెనే పెళ్లి చేసుకోవాలని భావించాడు. రేవంత్ రెడ్డికి రాజకీయ ఒత్తిడి సైతం వచ్చింది. అయినా కూడా భయపడలేదు. జైపాల్ రెడ్డితోనే రాయబారం ఏర్పరచుకొని ఆయననే ఒప్పించాడు రేవంత్ రెడ్డి. అప్పట్లో రేవంత్ రెడ్డి ధైర్య సాహసానికి జైపాల్ రెడ్డి గమనించి ఎప్పటికైనా రేవంత్ మంచి స్థాయికి వెళ్తాడని భావించాడు. దాంతో తన తమ్ముడిని ఒప్పించి గీతారెడ్డిని రేవంత్ రెడ్డి తో వివాహం జరిపించాడు. ఇద్దరిదీ ఒకే క్యాస్ట్ కావడంతో జైపాల్ రెడ్డి ప్రేమ వివాహం జరిపించి సక్సెస్ అయ్యాడు.

ALSO READ : ప్రగతి భవన్ కాదు, ప్రజా భవన్.. ఆరుగ్యారెంటీలతో పాటు మరో హామీ.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

ఇది ఇలా ఉండగా రేవంత్ రెడ్డి మొదట పెయింటర్ గా తన కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. మొదట తన రాజకీయ జీవితం టిఆర్ఎస్ తోనే ప్రారంభించారు. ఆ తర్వాత టిడిపిలోకి వెళ్లి తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నిలిచారు.

2021లో ఆయన టిడిపి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటికే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అద్వానంగా ఉండడం, గత ఎన్నికల సమయంలో అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ లో చేరటంతో అతనికి ప్రాధాన్యత లేదు. కానీ ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడిగా తనకు అధిష్టానం కట్టబెట్టడం.. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం అంతా రేవంత్ రెడ్డి చలువే.

ALSO READ : ఎన్నికల్లో జాయింట్ కిల్లర్..!