ప్రగతి భవన్ కాదు, ప్రజా భవన్.. ఆరుగ్యారెంటీలతో పాటు మరో హామీ.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

ఇక నుంచి ప్రగతి భవన్ కాదు.. ప్రజాభవన్ అని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సామాన్యులకు ప్రజాభవన్లోకి ఎప్పుడైనా స్వాగతం ఉంటుందని చెప్పారు.

ప్రగతి భవన్ కాదు, ప్రజా భవన్.. ఆరుగ్యారెంటీలతో పాటు మరో హామీ.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

హైదరాబాద్, మన సాక్షి:

ఇక నుంచి ప్రగతి భవన్ కాదు.. ప్రజాభవన్ అని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సామాన్యులకు ప్రజాభవన్లోకి ఎప్పుడైనా స్వాగతం ఉంటుందని చెప్పారు.

ఇక ముందు జరిగింది వేరు.. ఇకపై జరిగేది వేరే అని ఏదైనా ప్రజాస్వామ్యంగా ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేసే ఆరు గ్యారంటీలతో పాటు ప్రజాస్వామ్యతంగా పరిపాలన సాగిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారని ప్రతిపక్షంలో బీఆర్ఎస్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.

విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్రావు ఠాక్రే, హనుమంతరావు, విజయశాంతి తదితరులు ఉన్నారు.

ALSO READ : మిర్యాలగూడ : కాంగ్రెస్ అభ్యర్థి బి ఎల్ ఆర్ ఘనవిజయం.. కోలాహాలంగా మారిన మిర్యాలగూడ..!