మిర్యాలగూడ : కాంగ్రెస్ అభ్యర్థి బి ఎల్ ఆర్ ఘనవిజయం.. కోలాహాలంగా మారిన మిర్యాలగూడ..!

మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి ఘన విజయం సాధించారు. గతంలో ఏ పార్టీ అభ్యర్థి సాధించని మెజారిటీతో 50 వేల ఓట్లకు పైగా మెజారిటీ సాధించి విజయం సాధించారు.

మిర్యాలగూడ : కాంగ్రెస్ అభ్యర్థి బి ఎల్ ఆర్ ఘనవిజయం.. కోలాహాలంగా మారిన మిర్యాలగూడ..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి ఘన విజయం సాధించారు. గతంలో ఏ పార్టీ అభ్యర్థి సాధించని మెజారిటీతో 50 వేల ఓట్లకు పైగా మెజారిటీ సాధించి విజయం సాధించారు. అందరూ ఊహించినట్లుగానే భత్తుల లక్ష్మారెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన రాజకీయాలలోకి రాకముందే సేవా కార్యక్రమాల తో ప్రజలకు చేరువయ్యారు.

సామాజిక కార్యకర్తగా ప్రజలలో నిలిచిన భక్తుల లక్ష్మారెడ్డి మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీకి విజయానికి అంచున ఉంచాడు. ఆ తర్వాత ఆయన సేవా కార్యక్రమాలను, పార్టీ అభ్యున్నతిని గుర్తించి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. దాంతో నియోజకవర్గ ప్రజలు కూడా ఆయనను గెలిపించుకున్నారు.

రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న సమీప అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు పై 50,000 ఓట్లపైగా మెజారిటీతో విజయం సాధించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో పట్టణంతో పాటు మండలాల్లోని గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు నిర్వహిస్తుంది. బిఎల్ఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ కార్యకర్తలతో నియోజకవర్గం అంతా కోలాహాలంగా మారింది.

ALSO READ : ఎన్నికల్లో జాయింట్ కిల్లర్..!

భారీ మెజారిటీతో బిఎల్ఆర్ గెలుపు : 

మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు పై భారీ మెజారిటీతో విజయం సాధించారు. మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు ముందుగానే ఊహించినట్లుగానే అత్యధిక మెజార్టీతో విజయం సాధించి మిర్యాలగూడ చరిత్రలో రికార్డు సృష్టించారు.

ఇంత భారీ మెజారిటీతో ఇప్పటివరకు ఏ పార్టీ నుంచి అభ్యర్థి కూడా విజయం సాధించలేదు. భత్తుల లక్ష్మారెడ్డి మొదటిసారి పోటీ చేసి వారి మెజార్టీతో విజయం సాధించి రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భక్తుల లక్ష్మారెడ్డికి 1,12, 522 ఓట్లు రాగా సమీప బి ఆర్ ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావుకు 65, 239 ఓట్లు వచ్చాయి. 47,283 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

సిపిఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డికి 3197 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి సాదినేని శ్రీనివాసరావుకు 2979 ఓట్లు వచ్చాయి.

ALSO READ : మీసం తిప్పాడు.. విజయం సాధించాడు, రేవంత్ స్టైలే వేరు..!