Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యవసాయం

BREAKING : పేరంటాల చెరువు, మల్లెపువ్వు కాలవలకు గండి

BREAKING : పేరంటాల చెరువు, మల్లెపువ్వు కాలవలకు గండి

అశ్వారావుపేటలో రికార్డు స్థాయి వర్షపాతం

దమ్మపేట రూరల్, మన సాక్షి :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ప్రధాన చెరువులు కాలువలలో ఒకటైన దమ్మపేట పేరంటాల చెరువు అలుగు కాలువకు, మల్లెపూల వాగు కాలువకు గండి పడ్డాయి. భారీ వరద నీరు దాటికి నీరు ఉప్పొంగడంతో కాలువలు దెబ్బతిన్నాయి, పలుచోట్ల గండిపడ్డాయి.

ALSO READ : Revanth reddy : రేవంత్ రెడ్డి ఓ డైనమిక్ లీడర్.. ఆయన రాజకీయ ప్రస్థానం..!

దమ్మపేట పేరంటాల చెరువు అలుగు కాలువకు గండి పడటంతో దమ్మపేట మల్కారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నెమలి పేట గ్రామంలో ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటి దాటికి ఇళ్లల్లో నీరు చేరాయి, దీంతో ఆ గ్రామం ప్రజలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి ఏటా ఇదే సమస్య పునరావతమవుతున్న శాశ్వత పరిష్కారం చూపడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెమలి పేట కింద గుంపులో ఉండే ప్రజలకు బ్రిడ్జి లేకపోవడంతో కాలువ వెనుకే బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.

ALSO READ : సీఎం గా రేవంత్ రెడ్డి పేరు ఖరారు.. హై కమాండ్ స్పష్టం..!

మరిన్ని వార్తలు