Revanth reddy : రేవంత్ రెడ్డి ఓ డైనమిక్ లీడర్.. ఆయన రాజకీయ ప్రస్థానం..!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్ గా పేరు సంపాదించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాగా రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఆయన 54 సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కబోతున్నారు.

Revanth reddy : రేవంత్ రెడ్డి ఓ డైనమిక్ లీడర్.. ఆయన రాజకీయ ప్రస్థానం..!

హైదరాబాద్ , మన సాక్షి :

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్ గా పేరు సంపాదించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాగా రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఆయన 54 సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కబోతున్నారు.

20 సంవత్సరాల రాజకీయంలోనే ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకున్నారు. అందుకే రాష్ట్ర ప్రజలలో ఆయన ఒ డ్డైనమిక్ లీడర్ గా ఎదిగారు. రాజకీయాలలో తొలి అడుగులోనే జెడ్పిటిసిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లోను కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది ఓ సంచలనం సృష్టించారు.

ALSO READ : సీనియర్ కాంగ్రెస్ నేతలతో డీకే భేటీ.. సీఎం , మంత్రులు వారే..!

జెడ్పిటిసి గా రేవంత్ ప్రస్థానం :

రేవంత్ రెడ్డి మొదట పెయింటర్ గా తన కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. మొదట తన రాజకీయ జీవితం టిఆర్ఎస్ తోనే ప్రారంభించారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం జెడ్పిటిసి గా ప్రారంభమైంది. 2004లో అప్పటి టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

2006 సంవత్సరంలో మిడ్జిల్ మండలం జెడ్పిటిసి టికెట్ ఆశించారు. అయినా కూడా ఆయనకు అప్పుడు కాంగ్రెస్ – టిఆర్ఎస్ పొత్తు కారణంగా టికెట్ కేటాయించలేదు. దాంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అనూహ్యంగ గెలుపొందారు. ఆ తర్వాత అంతటితో ఆగకుండా 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

ALSO READ : సీఎం గా రేవంత్ రెడ్డి పేరు ఖరారు.. హై కమాండ్ స్పష్టం..!

ఆ తర్వాత 2008లో టిడిపిలో చేరారు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2009లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి గుర్నాథరెడ్డి పై 6989 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో అక్కడి నుంచే టిడిపి అభ్యర్థిగా పోటీచేసి అప్పటి టిఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న గుర్నాథరెడ్డి పై 14,694 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

కాంగ్రెస్ పార్టీలోకి :

రాజకీయ పరిస్థితుల కారణంగా 2017లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి నాటి టిఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కాగా 2019 లోకసభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి పై 10, 919 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గం దేశంలోనే అత్యధిక ఓటర్ల ఉన్న నియోజకవర్గం కావడం విశేషం. ఆ తర్వాత 2021 జూలైలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి పై 32,800 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

కొండారెడ్డి పల్లె ఆయన సొంతూరు :

రేవంత్ రెడ్డి సొంత గ్రామం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి. 1969 నవంబర్ 8వ తేదీన ఆయన నరసింహారెడ్డి – రామచంద్రమ్మ దంపతులకు జన్మించారు . రేవంత్ రెడ్డికి ఆరుగురు అన్నదమ్ములు, ఒక అక్క ఉన్నారు. వీరిలో రేవంత్ రెడ్డి ఐదోవాడు సొంత గ్రామం కొండారెడ్డి పల్లెలోనే ప్రాథమిక విద్య పూర్తి చేశారు.

ALSO READ : రేవంత్ రెడ్డిది ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ.. ఆయన రాజకీయం టిఆర్ఎస్ తోనే ప్రారంభం.. సోషల్ మీడియాలో వైరల్..!

వెల్దండ మండలంలోని తాండ్రలో ఆరో తరగతి, వనపర్తిలో హైస్కూల్, ఇంటర్మీడియట్ చదివారు. ఆ తర్వాత హైదరాబాద్ లో జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేశారు. డిగ్రీ చదువుకునే రోజుల్లోనే ఏబీవీపీ లో పనిచేశారు ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన జాగృతి పత్రికలో జర్నలిస్టుగా పనిచేశారు .

ప్రేమ వివాహం :

విద్యార్థి ఉద్యమ నాయకుడు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన రేవంత్ రెడ్డి ప్రేమ వివాహం ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా మారింది. స్టూడెంట్ గా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి ఏబీవీపీ లీడర్ గా ఉన్నారు. విద్యార్థి నాయకుడిగా అనేక కార్యక్రమాలు చేశారు. విద్యార్థులను ఉద్యమం వైపు నడిపించారు. ఆ సమయంలో అప్పటి మాజీ మంత్రి , కాంగ్రెస్ పార్టీ నాయకులు సూదిని జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురు గీతారెడ్డి రేవంత్ రెడ్డి పై మనసు పడింది.

రేవంత్ రెడ్డి స్టూడెంట్ లీడర్ గా ఉన్న సమయంలోనే ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత జైపాల్ రెడ్డి తమ్ముడికి విషయం తెలిసింది. రేవంత్ రెడ్డికి తన కూతురిని ఇచ్చి వివాహం చేయడం తనకు ఇష్టం లేదు. దాంతో ఢిల్లీలో ఉన్న జైపాల్ రెడ్డి వద్దకు తన కూతురిని పంపించాడు.

ALSO READ : ఎన్నికల్లో జాయింట్ కిల్లర్..!

అప్పటికే ఇద్దరు ప్రేమించుకోవడం వల్ల రేవంత్ రెడ్డి తగ్గకుండా ఆమెనే పెళ్లి చేసుకోవాలని భావించాడు. రేవంత్ రెడ్డికి రాజకీయ ఒత్తిడి సైతం వచ్చింది. అయినా కూడా భయపడలేదు. జైపాల్ రెడ్డితోనే రాయబారం ఏర్పరచుకొని ఆయననే ఒప్పించాడు రేవంత్ రెడ్డి.

అప్పట్లో రేవంత్ రెడ్డి ధైర్య సాహసానికి జైపాల్ రెడ్డి గమనించి ఎప్పటికైనా రేవంత్ మంచి స్థాయికి వెళ్తాడని భావించాడు. దాంతో తన తమ్ముడిని ఒప్పించి గీతారెడ్డిని రేవంత్ రెడ్డి తో వివాహం జరిపించాడు. ఇద్దరిదీ ఒకే క్యాస్ట్ కావడంతో జైపాల్ రెడ్డి ప్రేమ వివాహం జరిపించి సక్సెస్ అయ్యాడు.

ALSO READ : ప్రగతి భవన్ కాదు, ప్రజా భవన్.. ఆరుగ్యారెంటీలతో పాటు మరో హామీ.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!