భారీ వర్షం.. రైతులకు తీరని నష్టం..!
భారీ వర్షం.. రైతులకు తీరని నష్టం..!
దమ్మపేట రూరల్, మన సాక్షి :
మిచౌంగ్ తుఫాన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పై తీవ్ర ప్రభావం చూపింది. మండలంలోని వేరుశనగ, పొగాకు, వరి, మొక్కజొన్న రైతులకు వర్షం కన్నీరు మిగిల్చింది. గడిచిన 24 గంటల్లో మండలంలో 260 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో వర్షం కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ALSO READ : Revanth reddy : రేవంత్ రెడ్డి ఓ డైనమిక్ లీడర్.. ఆయన రాజకీయ ప్రస్థానం..!
మండలంలో ఇప్పటికే 80 శాతం మేర వరి పంట రైతులు హార్వెస్టింగ్ చేసినప్పటికీ మిగిలిన 20 శాతం వరి పంటకు వర్షం కారణంగా పలు చోట్ల దెబ్బతిన్నాయి. మొక్కజొన్న పంట మాత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం దాటికి నేలకొరిగాయి. పొగాకు రైతులకు తోటలలో నీరు చేరడంతో పంట దెబ్బతింటుంది.
వేరుశనగ రైతులకు మాత్రం భారీగా నష్టం జరిగిందనే చెప్పుకోవాలి, వేరుశనగ పంట నూర్పే సమయానికి భారీ వర్షం కారణంగా వేరుశెనక్కాయలు నల్ల బడుతున్నాయి. దీంతో ఆ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
ALSO READ : సీఎం గా రేవంత్ రెడ్డి పేరు ఖరారు.. హై కమాండ్ స్పష్టం..!









