Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Madgulapally : ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

Madgulapally : ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

మాడుగులపల్లి, మనసాక్షి :

అనారోగ్యం కారణంతో తీవ్ర మనస్థాపనతో ఉరి వేసుకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మడుగులపల్లి మండలంలోని చిరుమర్తి గ్రామంలో చోటుచేసుకుంది. మాడుగులపల్లి ఎస్సై కైగూరి నరేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం చిరుమర్తి గ్రామానికి చెందిన మండల మల్లయ్య తండ్రి లచ్చయ్య వయసు (58) సంవత్సరాలు రెండు సంవత్సరాల క్రితం కడుపునొప్పితో అపెండెక్స్ ఆపరేషన్ జరిగింది.

మరల గత మూడు నెలల క్రితం హెర్నియా ఆపరేషన్ జరిగింది. అయినా మల్లయ్య ఆరోగ్యం బాగుగాక తీవ్ర మానసిక క్షోభకు గురై ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఇంట్లో ఎవరు లేనిది చూసి గొర్రెల కోసం వేసిన రేకుల షెడ్డులో ఇనుపరాడుకు తాడుతో ఉరి వేసుకొని మృతి చెందాడు.

మృతుడి భార్య మండల జానమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్ఐ నరేష్ కుమార్ తెలిపారు మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగ పిల్లల సంతానం కలరు.

ALSO READ : Telangana : గులాబి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పేందుకు ముహూర్తం ఫిక్స్.. ఎంతమంది ఉన్నారంటే..!

మరిన్ని వార్తలు