Telangana : గులాబి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పేందుకు ముహూర్తం ఫిక్స్.. ఎంతమంది ఉన్నారంటే..!

గులాబీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కండువాలు కప్పేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అభినందించిన విషయం తెలిసిందే.

Telangana : గులాబి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పేందుకు ముహూర్తం ఫిక్స్.. ఎంతమంది ఉన్నారంటే..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

గులాబీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కండువాలు కప్పేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అభినందించిన విషయం తెలిసిందే. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఎవరిని కూడా పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధంగా లేదని సమాచారం.

కానీ కిందిస్థాయి నాయకులు మాజీ ఎమ్మెల్యేలు , జడ్పీ చైర్మన్లు , జెడ్ పి టి సి, మునిసిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ,ఎంపీపీలు ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటివరకు గులాబీ జెండాను విడిచి వెళ్లలేదు.

కాగా ఎమ్మెల్యేలకు కూడా కాంగ్రెస్ కండువా కప్పేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం. ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చేరికతోనే ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పే ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ఇటీవల ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కుటుంబ సభ్యులతో సహా కలిసిన విషయం తెలిసిందే. కాగా ఈనెల 11వ తేదీన బూర్గంపాడు లో రేవంత్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగానే ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఆయన ఇటీవల తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం , మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంకు సంబంధించి సమావేశం నిర్వహించినా కూడా వెంకట్రావు గైరాజరైన విషయం తెలిసిందే.

ALSO READ : BREAKING : నల్గొండలో కీచక ఉపాధ్యాయులు.. ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు, అరెస్టు చేసిన పోలీసులు..!

ఇదిలా ఉండగా 15 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపజేసి కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి గులాబీ కండువాలు కేసీఆర్ కప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండగా వారిలో 15 మంది ఎమ్మెల్యేలకు తగ్గకుండా కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు రేవంత్ రెడ్డి వ్యూహం పన్నినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈనెల 11వ తేదీతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పే ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.

ఎగువ స్థాయిలో బీఆర్ఎస్ కు చెందిన ఒక సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అదే విధంగా కిందిస్థాయి నాయకులు అంతా కాంగ్రెస్ లో చేరుతున్నారు. స్థానిక సంస్థలన్నీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఇది ఇలా ఉండగా ఎమ్మెల్యేలను కూడా తమ పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.

ALSO READ : Shock to Brs : బిఅరెస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరిన బిఅరెస్ కౌన్సిలర్లు..!