BREAKING : నల్గొండలో కీచక ఉపాధ్యాయులు.. ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు, అరెస్టు చేసిన పోలీసులు..!

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు మనవరాలి వయసున్న విద్యార్థినిలతో కీచకులుగా మారారు. నల్లగొండ పట్టణంలోని డైట్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినుల పై అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు ఉపాధ్యాయులను సోమవారం పోలీసులు అరెస్టు చేసిన సంఘటన కలకలం రేపింది.

BREAKING : నల్గొండలో కీచక ఉపాధ్యాయులు.. ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు, అరెస్టు చేసిన పోలీసులు..!

విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయులు

నల్లగొండ, మనసాక్షి:

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు మనవరాలి వయసున్న విద్యార్థినిలతో కీచకులుగా మారారు. నల్లగొండ పట్టణంలోని డైట్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినుల పై అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు ఉపాధ్యాయులను సోమవారం పోలీసులు అరెస్టు చేసిన సంఘటన కలకలం రేపింది.

ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోలే వెంకయ్య , పాఠశాల ఉపాధ్యాయుడు శ్యాంసుందర్ లు పిల్లలను శారీరకంగా స్పృశిస్తూ ముద్దులు పెట్టడం , ఐ లవ్ యు అని ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తూ విద్యార్థినులను మానసిక క్షోభకు గురి చేస్తున్నట్లు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో చెప్పగా తల్లిదండ్రులు ఎంఈఓ అరుంధతికి ఫిర్యాదు చేశారు.

దీంతో ఎంఈఓ అరుంధతి పాఠశాలలో విచారణ జరిపి ఆరోపణలు నిజమేనని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు .పోలీసులు ఉపాధ్యాయులను వెంటనే అరెస్టు చేశారు .అభం శుభం తెలియని ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యార్థినులను తమ మనవరాలు వయసున్న విద్యార్థులు పై ఉపాధ్యాయులు కీచకంగా వ్యవహరించడం ఉపాధ్యాయ లోకానికే తలవంపులు తీసుకువచ్చింది .

పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ తమ శిష్యులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు కామంతో మదమెక్కి వ్యవహరించడం పట్ల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సభ్య సమాజం తలవంచుకునేలా వ్యవహరించిన ఈ ఉపాధ్యాయులను పై కఠిన చర్య తీసుకోవాలని విద్యార్థినిలు తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ALSO READ : BRS : ఎల్ఆర్ఎస్ పై 6, 7న బీఆర్ఎస్ పోరుబాట..!