Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

BRS : ఎల్ఆర్ఎస్ పై 6, 7న బీఆర్ఎస్ పోరుబాట..!

BRS : ఎల్ఆర్ఎస్ పై 6, 7న బీఆర్ఎస్ పోరుబాట..!

హైదరాబాద్ , మన సాక్షి :

ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం) పై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బీఆర్ఎస్ పోరుబాట పట్టనున్నది. రాష్ట్ర ప్రజలపై ఎల్ఆర్ఎస్ పేరుతో భారం మోపడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అందుకుగాను ఈనెల ఆరవ తేదీన అన్ని నియోజకవర్గాలలో ధర్నాలు చేయాలని పిలుపునిచ్చింది. ఏడో తేదీన జిల్లా కలెక్టర్ ఆర్డీవోలకు వినతి పత్రాలు అందజేయాలని కేటీఆర్ పేర్కొన్నారు.

మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ తీసుకొస్తే కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని… అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో వచ్చి మళ్లీ ఎలా అమలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మార్చి 31వ తేదీ లోపు వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని డిమాండ్ చేశారు.

ALSO READ : Modi : తెలంగాణలో రూ.6697 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన నరేంద్ర మోడీ..!

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలో ఉన్నప్పుడు మరోలా.. మాట్లాడడం సరికాదన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోర్టులో పిల్ వేశారని, బట్టి విక్రమార్క అధికారంలోకి కాంగ్రెస్ వస్తే LRS రద్దు చేస్తామని అన్నారని అన్నారు, ఉత్తంకుమార్ రెడ్డి ఉచితంగా భూములు క్రమబద్ధీకరిస్తామని, దోచుకోవడానికి LRS తెచ్చారని సీతక్క ఇలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినారని ఆయన పేర్కొన్నారు

అందుకుగాను కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ ఈనెల 6వ తేదీన అన్ని నియోజకవర్గాలలో హైదరాబాదులోని జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపడతామని, 7వ తేదీన జిల్లా కలెక్టర్ ఆర్డీవోలకు వినతి పత్రాలు అందజేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.

ALSO READ : BIG BREAKING : ముగ్గురు కొడుకులకు ఉరేసి.. తండ్రి ఆత్మహత్య..!

మరిన్ని వార్తలు