Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Irregularities in PACS : సూర్యాపేట జిల్లా చిల్లేపల్లి సహకార సంఘంలో రూ.2 కోట్ల అక్రమాలు.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిరసన..!

Irregularities in PACS : సూర్యాపేట జిల్లా చిల్లేపల్లి సహకార సంఘంలో రూ.2 కోట్ల అక్రమాలు.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిరసన..!

సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన చైర్మన్, డైరెక్టర్లు

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి సహకార సంఘంలో ధాన్యం కొనుగోలు విషయంలో మాజీ చైర్మన్ రెండు కోట్ల రూపాయలకు పైగా అక్రమాలకు పాల్పడిన విషయంలో ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని చిల్లెపల్లి సహకార సంఘం ప్రస్తుత చైర్మన్ మలిగిరెడ్డి రమణారెడ్డి, డైరెక్టర్లు మలిగిరెడ్డి హేమలత, పెరువాల రంగారెడ్డి, పల్లా వెంకన్న, ముత్తమ్మ, గోవిందు తదితరులు డిమాండ్ చేశారు.

 

ఈ మేరకు బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వారు నిరసన చేపట్టిన సందర్భంగా మాట్లాడారు. 2020 21 సంవత్సరానికి గాను ఐకెపిల ద్వారా దాన్యం కొనుగోలు చిల్లేపల్లి సహకార సంఘ పరిధిలో చేపట్టాల్సి ఉండగా నాటి సంఘ చైర్మన్, సీఈవో, మిల్లు యజమానులు కుమ్మక్కై వేరే ప్రాంత రైతుల పేర్ల ట్రక్ సీట్లు, బిల్లులు తయారుచేసి కొన్నట్టుగా ఎలాంటి దాన్యం కొనుగోలు జరపకుండానే రెండు కోట్ల రూపాయలను స్వాహా చేశారని వారు ఆరోపించారు.

 

ALSO READ : Mallanna knows about Revanth : రేవంత్ సంగతి మల్లన్నకు తెలుసు..!

 

చిల్లేపల్లితో పాటు మాజీ ఛైర్మన్ కొన్నట్టుగా ఆ ప్రాంతంలో వ్యవసాయ శాఖ అధికారులు చెప్పిన ప్రకారం రైతులు సన్నరకం దాన్యం పండించారని, అయితే అక్రమాలకు పాల్పడ్డ మాజీ చైర్మన్ మాత్రం దొడ్డు ఒడ్లు కొన్నట్టు రికార్డులలో చూపించారని, రైతులు సన్న ఓడ్లు పండిస్తే దొడ్లు వడ్లు ఎలా కొంటారని వారు అనుమానాలు వ్యక్తం చేశారు.

 

ఈ విషయంలో పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులకు, సహకార శాఖ అధికారులకు వినతిపత్రం ఇచ్చినప్పటికీ ఇంకా విచారణ పూర్తి చేసి సంబంధిత బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా చిల్లేపల్లి సహకార సంఘం మాజీ చైర్మన్, సీఈఓ లపై చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు

 

ALSO READ : Good News : ఇసుక రవాణా పై ప్రభుత్వం గుడ్ న్యూస్..!

మరిన్ని వార్తలు