BIG BREAKING : సూర్యాపేటలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, పలువురికి గాయాలు..!
BIG BREAKING : సూర్యాపేటలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, పలువురికి గాయాలు..!
సూర్యాపేట, మనసాక్షి
సూర్యాపేట జిల్లాలో ఆటోను లారీ ఢీకొట్టిన సంఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంజనాపురి కాలని సమిపంలోని హైవే వద్ద ప్రమాదవాసస్తూ లారీని ఆటో డికొన్న ఘటనలో ఇద్దరు మహిళలతో పాటు ఒక చిన్నారి మృతి , పలువురు క్షతగాత్రులకు గాయాలు అయిన ఘటనపై జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన జిల్లా కేంద్రంలో ప్రభుత్వ హాస్పటల్‌కు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.
గాయాల పాలైన వారిలో కొందరి వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్లతో మాట్లాడి హైద్రాబాద్‌లోని గాందీ, నిమ్స్‌లకు తరలించారు. ఈ సదర్బంగా మాట్లాడుతూ క్షతగ్రాతులకు తక్షణ వైద్యసేవలు అందించేందుకు జిల్ల కేంద్రంలోని హాస్పటల్‌లో 15 టీములలలో 30 మంది డాక్టర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అదే విదంగా హైద్రాబాద్‌లో గాందీ, నిమ్స్ హాస్పటల్‌లలో డాక్లర్లతో మాట్లాడి వైద్యసేవలకు సిద్దం చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, వైద్యారోగ్యశాఖ కమీషనర్‌కు సమాచారం అందించామని తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డిఓ వేణుమాధవ్ తాసిల్దార్ శ్యాంసుందర్ రెడ్డి డిఎస్పి రాములు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు :









