Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : కళాభారతి కి కేసీఆర్ పేరు తొలగించాలి.. కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి..!

Miryalaguda : కళాభారతి కి కేసీఆర్ పేరు తొలగించాలి.. కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ పట్టణంలోని మినీ రవీంద్ర భారతి ఆడిటోరియంకు కేసిఆర్ కళాభారతి అని పేరు ఉండడంతో అభ్యంతరం చెప్పిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసిఆర్ పేరు తొలగించాలని మంగళవారం ఆర్డీవో కు వినతిపత్రం అందజేశారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి మాట్లాడుతూ మినీ రవీంద్ర భారతి గా పిలవబడుతున్నటువంటి కళాక్షేత్రానికి ఎలాంటి తీర్మానాలు లేకుండా ఏ అధికారి యొక్క ఉత్తర్వులు కూడా లేకుండా కాంట్రాక్టర్ అత్యుత్సాహంతో తనకు నచ్చిన రీతిలో కెసిఆర్ కళాభారతిగా పేరును మార్చారని అన్నారు. ఈ కళాక్షేత్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ లావాదేవీలన్నీ కూడా మినీ రవీంద్ర భారతి పేరు మీదనే జరిగినట్లు సమాచారం.

 

కాబట్టి ఈ కళాభారత్ కి గతంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు దివంగత నేత జయపాల్ రెడ్డి, మంజూరు చేయించి ఈ భవన నిర్మాణానికి రెండు కోట్ల రూపాయల నిధులను కూడా సమకూర్చడం జరిగిందని అన్నారు. పనులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగినవని కాబట్టి దీనిని మినీ రవీంద్ర భారతి గానే పిలవాలని అన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందువలన ఎలాంటి రాజకీయ నాయకుల పేర్ల మీద కళాక్షేత్రాలు ఉండకూడదు కాబట్టి వెంటనే ఆ బోర్డును తొలగించి సదరు కాంట్రాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోగలరని కోరినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్ముడైన అర్జున్, కౌన్సిలర్లు దేశిడి శేఖర్ రెడ్డి ,గంధం రామకృష్ణ , జావీద్, చల్ల నాగమ్మవెంకన్న , గుంజా చంద్రకళశ్రీనివాస్, కోడి రెక్కఇంద్ర కుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అజార్ మాజీ కౌన్సిలర్లు ఆలగడప గిరిధర్, యాదగిరి , బల్గురు శ్రీనివాస్, వార్డ్ ఇన్చార్జిలు సలీం, ఆరిఫ్, నాగిరెడ్డి ,గోవర్ధన చారి, వెంకటకృష్ణ, అబ్దుల్లా విష్ణు, చక్రి, మంగ్య నాయక్, బెజ్జం నాగరాజు, పర్వేజ్ ఖాన్, ఇమ్రాన్ , అనిల్ , గోదాల జానకి రామ్ రెడ్డి, బంటువీటి, కాశయ్య, హలీం, సంతోష్, రమేష్ నాయక్, సికిందర్, అవుట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

మరిన్ని వార్తలు