KCR : ఫాఫం కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మూడు నెలల ముచ్చటగా కారు పార్టీ కథ..!

ఫాఫం కేసిఆర్.. ఎట్లాంటోళ్లు.. ఎట్లా ఉండేటోళ్లు.. ఎట్లా అయ్యారు. కెసిఆర్, బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. పదేళ్లపాటు అధికారంలో.. అంతకు ముందు తెలంగాణ ఉద్యమంలో... కేసీఆర్ అంటే తెలంగాణలో ఓ వెలుగు వెలిగారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మూడు నెలలకే ఆ పార్టీ కథ కూడా ముగిసినట్టు అయింది.

KCR : ఫాఫం కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మూడు నెలల ముచ్చటగా కారు పార్టీ కథ..!

దొరక్క.. దొరక్క దొరికిన అభ్యర్థులు కూడా ఉండట్లే..!

అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాలే కారణమా

బీఆర్ఎస్ ను వెంటాడుతున్న లిక్కర్ కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్

మనసాక్షి, తెలంగాణ బ్యూరో :

ఫాఫం కేసిఆర్.. ఎట్లాంటోళ్లు.. ఎట్లా ఉండేటోళ్లు.. ఎట్లా అయ్యారు. కెసిఆర్, బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. పదేళ్లపాటు అధికారంలో.. అంతకు ముందు తెలంగాణ ఉద్యమంలో… కేసీఆర్ అంటే తెలంగాణలో ఓ వెలుగు వెలిగారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మూడు నెలలకే ఆ పార్టీ కథ కూడా ముగిసినట్టు అయింది. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. అనేది నగ్న సత్యంగా మారింది. పదేళ్లపాటు అధికారంలో ఉండి చేసిన తప్పులే.. ఇప్పుడు ఆ పార్టీకి శాపంగా మారిందా? అనిపిస్తుంది.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని వెంటాడి.. వేటాడి పార్టీని లేకుండా చేయడమే కేసీఆర్ కంకణం కట్టుకొని ఆ పార్టీలో నేతలు అందరిని తన పార్టీలో చేర్చుకున్నారు. మంత్రి పదవులు సైతం కట్టబెట్టి అధికారం చేతికి ఇచ్చాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వెంటపడి గత అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అందరిని చేర్చుకొని పార్టీని లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నాడు.

 

కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బి.ఆర్.ఎస్ పై తిరుగుబాటు, ఎమ్మెల్యేల పై వ్యతిరేకత, కెసిఆర్ కుటుంబం పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కనబడింది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి అండగా ఉంటాడని రాష్ట్ర ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భావించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఆ తర్వాత మూడు నెలల ముచ్చటగా బీఆర్ఎస్ కథ మిగిలిపోయింది.

 

ALSO READ : BREAKING : రేవంత్ తో కేకే భేటీ.. చనిపోయే వరకు కాంగ్రెస్ లోనే ఉంటానని కేకే ప్రకటన..!

 

టిఆర్ఎస్ గా ఉన్న పార్టీని బీఆర్ఎస్ గా పేరు మార్చుకొని జాతీయస్థాయిలో చక్రం తిప్పలని కేసీఆర్ భావించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో 2024 ఎన్నికల్లో ఎంపీలను నిలబెట్టి తాను కేంద్రంలో చక్రం తిప్పాలని భావించారు. కానీ 2024 రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 పార్లమెంటు నియోజకవర్గం కూడా అభ్యర్థులను నిలబెట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది.
గతంలో ఉన్న సిట్టింగ్ ఎంపీలు శాతం ఐదుగురు పార్టీని వీడి వెళ్లిపోయారు. గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేజారి పోతున్నారు.

 

వెతికి వెతికి చివరికి 17 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. 17 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా వరంగల్ పార్లమెంటు అభ్యర్థిని… నువ్వెంత..? నీ టికెట్ ఎంత..? అని చెప్పకుండానే చెప్పి పార్టీని వెళుతున్నారు. అంటే కెసిఆర్ పరిస్థితి ఎలా ఉందో చెప్పనక్కరలేదు.

బీఆర్ఎస్ ను వెంటాడుతున్న లిక్కర్ కుంభకోణం, ఫోన్ టాపింగ్ :

బీఆర్ఎస్ పార్టీని లిక్కర్ కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్ వెంటాడుతుంది. లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత అరెస్టై తీహార్ జైల్లో ఉంది. ఫోన్ ట్యాపింగ్ లో బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పోలీస్ అధికారులు ఎంతోమంది పోలీస్ కస్టడీలో ఉన్నారు. లక్ష కోట్ల ఖర్చుతో నిర్మించిన కాలేశ్వరం కూలిపోయే పరిస్థితి. చివరికి ప్రజల్లో ఆ పార్టీకి చిత్కారం వచ్చింది.

 

ALSO READ : KTR : ముఖ్యమంత్రా.. బోటి కొట్టేవాడా, రేవంత్ రెడ్డి పై కేటీఆర్ ఫైర్..!

 

దాంతో పార్లమెంటు ఎన్నికల నాటికే ఆ పార్టీ కథ ముగిసిందని రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కథ మూడు నెలల ముచ్చటగా మిగిలిపోయింది. ఇంకా ఆ పార్టీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు , ఎమ్మెల్సీలు వెళ్లిపోతారని ఆ పార్టీ అధినేతకు కూడా అంతు చిక్కే పరిస్థితి లేకుండా పోయింది. పార్లమెంటు ఎన్నికల్లో నాటికి వేచి చూద్దాం…!