KTR : ముఖ్యమంత్రా.. బోటి కొట్టేవాడా, రేవంత్ రెడ్డి పై కేటీఆర్ ఫైర్..!

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మాట్లాడడం లేదని.. నా కొడకల్లారా చూసుకుందా. అంటూ పేగులు మెడకేసుకుంటా అంటూ.. భాష మాట్లాడుతున్నాడని, ఆయన ముఖ్యమంత్రా లేక బోటి కొట్టేవాడా..? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు.

KTR : ముఖ్యమంత్రా.. బోటి కొట్టేవాడా, రేవంత్ రెడ్డి పై కేటీఆర్ ఫైర్..!

100 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, మన సాక్షి :

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మాట్లాడడం లేదని.. నా కొడకల్లారా చూసుకుందా. అంటూ పేగులు మెడకేసుకుంటా అంటూ.. భాష మాట్లాడుతున్నాడని, ఆయన ముఖ్యమంత్రా లేక బోటి కొట్టేవాడా..? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. 100 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు.

 

బుధవారం మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో నేతలకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పై విమర్శల గుర్తించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు. మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదన్నారు. మల్కాజిగిరిలో పోటీ చేయడం అంటే రేవంత్ భయపడుతున్నారు అని కేటీఆర్ అన్నారు. ఇప్పటికి రుణమాఫీ, రైతుబంధు రాలేదన్నారు. వందరోజుల అబద్ధం రేవంత్ రెడ్డి అని కేటీఆర్ విమర్శించారు.

 

ఇంట్లో ఇద్దరికీ పెన్షన్ ఇస్తామన్నారు ఏమైంది రేవంత్ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక వర్గం కూడా సంతోషంగా లేదని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ శూన్యం నుంచి సునామి రప్పించారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం బీఆర్ఎస్ గెలిస్తే అందరి నీళ్ళకు తాళం పడుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి బడే బాయ్ అంటున్నాడు.. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆయన బిజెపిలోకి వెళ్లడం ఖాయం అన్నారు.

 

దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం మల్కాజిగిరి అని, ఇక్కడ 30 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని అన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలలో 24 స్థానాలలో బీఆర్ఎస్ గెలుపొందింది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు పళ్ళు పొల్లుగా తిడుతున్నారని కేటీఆర్ అన్నారు.

ALSO READ : KCR : రైతుల కోసం రంగంలోకి దిగనున్న కేసీఆర్.. నల్లగొండ, భువనగిరి పార్లమెంటు పరిధిలో పర్యటన ఖరారు..!