Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయంవ్యవసాయం

KCR : రైతుల కోసం రంగంలోకి దిగనున్న కేసీఆర్.. నల్లగొండ, భువనగిరి పార్లమెంటు పరిధిలో పర్యటన ఖరారు..!

KCR : రైతుల కోసం రంగంలోకి దిగనున్న కేసీఆర్.. నల్లగొండ,

భువనగిరి పార్లమెంటు పరిధిలో పర్యటన ఖరారు..!

ఎండిన పంట పొలాల పరిశీలనకై నల్లగొండలో గులాబీ బాస్ పర్యటన

నల్లగొండ లోకసభ పరిధిలోని ముషంపల్లి

భోనగిరి లోకసభ పరిధిలోని ఆలేరు లలో

మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ అభ్యర్థన మేరకు స్పందించిన కేసీఆర్

రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్న పార్టీ యంత్రాంగం

నలగొండ , మన సాక్షి :

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలను స్వయంగా తెలుసుకునేందుకు గాను మాజీ ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. జిల్లాకు చెందిన మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గడిచిన వారం రోజులుగా ఎండిన పంటపోలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అందుకు సంబంధించిన నివేదికను అధినేతకు అంద జేయడం తో పాటు మీరు కుడా స్వయంగా పరిశీలించి క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాన్ని పరిశీలించాలని అభ్యర్దించారు.  అందుకు అనుగుణంగా స్పందించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం రాత్రి తనను కలిసిన కంచర్ల బ్రదర్స్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నల్లగొండ మండలం ముషంపల్లితో పాటు ఆలేరు నియోజకవర్గ పరిధిలో పర్యటించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు.

 

గడిచిన పది సంవత్సరాలు ఎండిపోని పంట పొలాలు ఈ మారు ఎందుకు ఎండి పోయాయో అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవ పరిస్థితి ని నల్లగొండ మాజీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి వివరిస్తుంటే తట్టుకోలేక పోయిన కేసీఆర్ తక్షణమే తానే స్వయంగా క్షేత్ర స్థాయిలో రంగంలోకి దిగి ఎండి పోయిన పంట పొలాలను పరిశీలిస్తానని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డితో మాట్లాడి రూట్ మ్యాప్ తయారు చేస్తామని కేసీఆర్ కంచర్ల బ్రదర్స్ కు చెప్పారు. అత్యధికంగా బోర్లు వేసి నష్ట పోయిన నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామం నుండే ఈ పరిశీలన మొదలు పెట్టె విదంగా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు.

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు