BIG BREAKING : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు.. ధర్మల్ ప్లాంట్స్ పై విచారణ..!
BIG BREAKING : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు.. ధర్మల్ ప్లాంట్స్ పై విచారణ..!
మన సాక్షి :
విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు అందజేశారు. భారీగా నిధులు ఖర్చు చేసి పవర్ కొనుగోలు విషయంపై నోటీసులు జారీ చేసినట్లు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలిపారు. ఈనెల 15వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో కోరినట్లు తెలిపారు.
కాగా జూలై 30వ తేదీ వరకు సమయం అడిగినట్లు ఆయన పేర్కొన్నారు. మూడు అంశాలపై విచారణ కొనసాగుతుందని నరసింహారెడ్డి తెలిపారు. చత్తీస్గడ్, భద్రాద్రి , యాదాద్రి ధర్మ ప్లాంట్స్ పై విచారణ కొనసాగుతుందన్నారు. టెండర్ల ప్రక్రియ లేకుండానే ఒప్పందాలు జరిగాయని నరసింహారెడ్డి పేర్కొన్నారు.
మాజీ సీఎండి ఇప్పుడున్న సీఎండితో సమావేశం జరిపారని మాజీ సీఎండీ ప్రభాకర్ రావు, అప్పటి ప్రిన్సిపల్ సెక్రెటరీ తో సమావేశం నిర్వహించామని తెలిపారు. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై మాజీ సీఎం కేసీఆర కేసీఆర్ తో సహా 25 మందికి నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ALSO READ :
Runa Mafi : రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీకి విధి విధానాలు సిద్ధం, సర్వత్ర చర్చ..!
Ap News : రేపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం.. హాజరుకానున్న నరేంద్ర మోడీ..!









