Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజాతీయంరాజకీయం

Modi Cabinet : చిన్న రాష్ట్రం.. గెలిచింది అయిదుగురు, ముగ్గురికి కేంద్ర మంత్రి పదవులు.. ఎందుకో తెలుసా..?

Modi Cabinet : చిన్న రాష్ట్రం.. గెలిచింది అయిదుగురు, ముగ్గురికి కేంద్ర మంత్రి పదవులు.. ఎందుకో తెలుసా..?

మన సాక్షి , వెబ్ డెస్క్:

ఒక్కోసారి అనుకోని అదృష్టం తలుపు తడుతుంది. సరిగ్గా అదే జరిగింది. అదొక చిన్న రాష్ట్రం.. అక్కడ ఉన్నది 10 పార్లమెంటు నియోజకవర్గం మాత్రమే. బిజెపి గెలిచింది. ఐదు స్థానాల్లో.. గెలిచిన ఐదుగురిలో ముగ్గురికి కేంద్ర మంత్రి పదవులు వచ్చాయి. అవి ఎందుకో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి..

అనుకొని అదృష్టం ఒక్కోసారి తలుపు తడుతుంది. సరిగ్గా హర్యానా రాష్ట్రంలో కూడా ఇదే జరిగింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మోడీతోపాటు 71 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రి పదవులు రాష్ట్రాల ఎంపీల ప్రాతిపదికన కేటాయించారు.

 

ALSO READ : ముగిసిన రామోజీ అంత్యక్రియలు.. పాడెపట్టిన చంద్రబాబు..!

 

కానీ హర్యానా రాష్ట్రంలో మాత్రం అది జరగలేదు. హర్యానా రాష్ట్రంలో కేవలం 90 శాసనసభ నియోజకవర్గాలు 10 లోకసభ నియోజకవర్గాలు ఉన్నాయి. కాగా ప్రస్తుత ఎన్నికల్లో బిజెపి 5 ఎంపీలను మాత్రమే గెలుచుకుంది. కాగా ఈ ఐదుగురిలో హర్యానకు మోడీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అయిదుగురిలో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చారు. ఎందుకంటే హర్యానాలో ఈ ఏడాది చివరలో శాసనసభ ఎన్నికలు ఉండడమే కారణమని చెప్పవచ్చును.

హర్యానా ప్రభుత్వం ఏడాది నవంబర్ తో ముగుస్తుంది. అక్టోబర్ నెలాఖరులోపు హర్యానాలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. దాంతో హర్యానా రాష్ట్రంపై బిజెపి ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. అందుకే అక్కడ గెలిచిన ఐదుగురిలో ముగ్గురికి కేంద్ర మంత్రి పదవులు కట్టబెట్టారు. హర్యానా మాజీ సీఎం మనోహర్లాల్ కట్టర్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

 

ALSO READ : IND vs PAK. : ఉత్కంఠ భరితంగా మ్యాచ్.. పాక్ పై భారత్ ఘన విజయం..!

 

మైనార్టీలో హర్యానా ప్రభుత్వం :

హర్యానా రాష్ట్రంలో 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అధికారం కోసం 46 స్థానాలు ఉండాలి. కాగా బిజెపికి 41 సీట్లు ఉన్నాయి. ఎన్డీఏ భాగస్వామి పార్టీ హెచ్ ఎల్ పి కి ఒక సీటు, మరో ఇండిపెండెంట్ చేరడంతో ఆ పార్టీకి 43 కు చేరింది. ప్రస్తుతం 3 ఎమ్మెల్యే స్థానాలు ఖాళీగా ఉండటంతో ప్రభుత్వ ఏర్పాటుకు 44 మంది అవసరం ఉంది.

కానీ బిజెపికి 43 మంది ఉన్నారు. కాగా మరో నాలుగు మాసాల్లో హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు ఉండడంతో కేంద్ర మంత్రివర్గంలో హర్యానా రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలనేదే మోడీ మంత్రం.

ALSO READ : 

Mobile : మీ మొబైల్ ఫోన్ వర్షంలో తడిసి స్పీకర్లలోకి మీరు చేరిందా..? డౌట్ ఉంటే ఇలా చేయండి..!

NDA : చంద్రబాబు, నితీష్.. మోడీకి షాక్ ఇస్తారా..? 

Ap News : జగన్ ఓటమికి అదేనా కారణం.. బాబు రాజకీయ అపరచానిక్యుడిగా మరోసారి రుజువు..!

మరిన్ని వార్తలు