ముగిసిన రామోజీ అంత్యక్రియలు.. పాడెపట్టిన చంద్రబాబు..!

బంధుమిత్రుల , ప్రముఖుల నివాళుల నడుమ రామోజీ గ్రూప్స్ చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వం లాంచనాలతో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించింది.

ముగిసిన రామోజీ అంత్యక్రియలు.. పాడెపట్టిన చంద్రబాబు..!

హైదరాబాద్ , మన సాక్షి :

బంధుమిత్రుల , ప్రముఖుల నివాళుల నడుమ రామోజీ గ్రూప్స్ చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వం లాంచనాలతో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించింది. రామోజీ ఫిలిం సిటీ లోని విశాలమైన ప్రాంతంలో రామోజీరావు ముందుగానే నిర్మించుకున్న స్మృతి వనంలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. పోలీసులు గౌరవ సూచకంగా గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.

రామోజీరావు పెద్ద కుమారుడు ఈనాడు ఎండి కిరణ్ చితికి నిప్పంటించారు. రామోజీరావు అంత్యక్రియలకు భారీగా ప్రముఖులు తరలివచ్చారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్మృతి వనం లోపలి వరకు పాడే మోశారు. అంతిమ సంస్కారం పూర్తయ్యే వరకు చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు వారి కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి అక్కడే ఉన్నారు. జోహార్ రామోజీరావు అంటూ నినాదాలు మధ్య అంత్యక్రియలు ముగిశాయి.

రామోజీరావు కడచూపు సందర్భంగా శృతి వనం వద్ద భార్య రమాదేవి, పెద్ద కుమారుడు కిరణ్, కోడళ్ళు శైలజాకిరణ్, విజయేశ్వరి, మన వాళ్లు , మనవరాలు సుజయ్, సహారి, బృహతి, దివిజ, కీర్తి సోహన కన్నీటి పర్యంతమయ్యారు.

కుటుంబ సభ్యులతో పాటు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాని న్యాయమూర్తి ఎన్వి రమణ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ ఐఏఎస్ అధికారులు రజత్ భార్గవ, సిసోడియా, సాయి ప్రసాద్ లు శ్రద్ధాంజలి ఘటించారు.

ALSO READ : 

IND vs PAK. : ఉత్కంఠ భరితంగా మ్యాచ్.. పాక్ పై భారత్ ఘన విజయం..!

Mobile : మీ మొబైల్ ఫోన్ వర్షంలో తడిసి స్పీకర్లలోకి మీరు చేరిందా..? డౌట్ ఉంటే ఇలా చేయండి..!

NDA : చంద్రబాబు, నితీష్.. మోడీకి షాక్ ఇస్తారా..?