Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్జాతీయంరాజకీయం

NDA : చంద్రబాబు, నితీష్.. మోడీకి షాక్ ఇస్తారా..? 

NDA : చంద్రబాబు, నితీష్.. మోడీకి షాక్ ఇస్తారా..? 

మన సాక్షి , వెబ్ డెస్క్ :

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. కేంద్రంలో ఏ పార్టీ కూడా సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు. బిజెపి సొంతంగా అధికారంలోకి వచ్చే సీట్లు సాధించడంతోపాటు ఎన్డీఏ కూటమి 400కు పైగా స్థానాలను గెలుచుకుంటుందని మోడీ పదేపదే ప్రకటించారు. అయినా కూడా ఎన్డీఏ కూటమి 294 వద్దనే ఆగిపోయింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 272 ఎంపీలు ఉండాల్సిందే. మ్యాజిక్ ఫిగర్ కు దాటి కొద్దిగా ఉన్నారు. కేవలం 22 స్థానాలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి.

ఇండియా కూటమి కూడా అత్యధిక స్థానాలను గెలుచుకొని ఎన్డీఏకు దీటుగా నిలిచింది. ఇండియా కూటమిలో ఉన్న పార్టీలను ఆకర్షించేందుకు కూడా కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ వేధింపుల వల్ల ఇబ్బంది పడిన నేతలు తమ వైపుకు రావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా తమవైపుకు తిప్పుకునేందుకు ప్రాంతీయ పార్టీలతో చర్చలు సైతం జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఎన్డీఏ కూటమిలో నారా చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ కీలకంగా ఉన్నారు.

ఇప్పుడు వారిద్దరిది ఎన్డీఏ కూటమిలో కొనసాగుతున్నారు. వారికి కీలక పదవులు కట్టబెట్టేందుకు కూడా నరేంద్ర మోడీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లు మోడీని ప్రధానిని చేస్తారా..? లేదా షాక్ ఇస్తారా..? అనేది దేశవ్యాప్తంగా చర్చ సాగుతుంది. వీరిద్దరు కూడా మోడీ వేధించినట్లు గతంలో ఆనవాళ్లు కూడా ఉన్నాయి. దాంతో వీళ్లిద్దరు ఎన్డీఏ కూటమిలో కొనసాగుతారా..? లేదా..? ఇండియా కూటమికి చేరుతారా.? అనేది తెలియాల్సి ఉంది.

నారా చంద్రబాబు నాయుడుకు 16 ఎంపీలు, నితీష్ కుమార్ కు 12 ఎంపీలు ఉన్నారు. వారితోపాటు జనసేనకు రెండు ఎంపీ సీట్లు ఉన్నాయి. వీరు ఇండియా కూటమితో జతకడితే మోడీకి గడ్డు పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. వీరు మోడీని ప్రధానిని చేసే అవకాశాలు ఉన్నాయా..? లేక ఇండియా కూటమితో జతకట్టి మోడీకి షాక్ ఇస్తారా..? అనేది సర్వత్ర చర్చ సాగుతుంది. అందుకని వీరిద్దరికి కూడా నరేంద్ర మోడీ కీలక పదవులు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ALSO READ : 

Ap News : జగన్ ఓటమికి అదేనా కారణం.. బాబు రాజకీయ అపరచానిక్యుడిగా మరోసారి రుజువు..!

Ap News : ఏపీలో మొదలైన ఆట.. వేట..!

Ration Card : మీకు రేషన్ కార్డు ఉందా..? ఉంటే ప్రతి నెల రూ. 5 వేలు పొందవచ్చు, మీరు తెలుసుకోండి..!

BREAKING : దామరచర్ల వైటిపిఎస్ లో రూ.1.49 కోట్ల విలువైన అల్యూమినియం షీట్ల చోరీ.. చాకచక్యంగా చేదించిన పోలీసులు..!

మరిన్ని వార్తలు