Gajwel : వర్షాల కోసం మహా శివునికి జలాభిషేకాలు..!
Gajwel : వర్షాల కోసం మహా శివునికి జలాభిషేకాలు..!
గజ్వేల్, మనసాక్షి :
వర్షాలు సకాలంలో కురువాలని కోరుతూ శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో బుధవారం నాడు ప్రజ్ఞాపూర్ లోని పార్థివేశ్వర స్వామి దేవాలయంలో మహాశివునికి పంచామృత అభిషేకాలు, జలాభిషేకాలు ఘనంగా నిర్వహించి ఓం నమఃశివాయ పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తు మహాశివుణ్ణి వేడుకున్నారు.
ఈ సందర్బంగా సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ వర్షాలు సంమృద్ధిగా కురిస్తేనే పాడిపంటలు బాగా పండుతాయని తద్వారా వ్యవసాయం ముందుకు సాగుతుందన్నారు.దేశానికి రైతే వెన్నుముఖ,అలాంటి రైతు సుఖంగా జీవించకుంటే పరిపాలన కూడా ఆస్థవ్యస్తంగా మారుతుందన్నాడు.
అందుకే వర్షాలు కురిసి రైతు చల్లగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు తుమ్మ శ్రీనివాస్, అంరాది రమేష్,మెతుకు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :
Whatsspp : వాట్సాప్ లో అదిరిపోయే మెటా ఏఐ ఫీచర్.. తెలియని విషయాలు సెకండ్లలో తెలుసుకోవచ్చు..!
Mahalakshmi: ప్రతి మహిళకు నెలకు ₹2500 ఎప్పటినుంచంటే.. మీరు అర్హులేనా..?









