Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణసంక్షేమం

Mahalakshmi: ప్రతి మహిళకు నెలకు ₹2500 ఎప్పటినుంచంటే.. మీరు అర్హులేనా..?

Mahalakshmi: ప్రతి మహిళకు నెలకు ₹2500 ఎప్పటినుంచంటే.. మీరు అర్హులేనా..?

మనసాక్షి :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలను అమలు చేయడానికి కసరత్తు సాగుతోంది. ఆరు గ్యారెంటీ హామీలలో మహాలక్ష్మి పథకం కూడా ఒకటి. ఈ పథకంలో భాగంగా తెలంగాణలోని ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయల ఆర్థిక సహాయం చేయడమే ప్రధాన ఉద్దేశం.

ఎన్నికల సమయంలో ప్రతి మహిళకు నెలకి ₹2,500 ఆర్థిక సహాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు మాసాలు గడుస్తుందివ ఇప్పటివరకు మహాలక్ష్మి పథకం కు సంబంధించిన విధివిధానాలు ఇంకా రూపొందించలేదు.

ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించిన కసరత్తు కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 31 వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసేందుకు కసరత్తు కొనసాగుతుంది. ఇటీవల మంత్రివర్గం కూడా తీర్మానం చేయడం జరిగింది. అధికారులు కూడా కసరత్తు నిర్వహిస్తున్నారు. జూలై మాసం నుంచి రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఆగస్టు 15వ తేదీ వరకు సంపూర్ణంగా రుణమాఫీ చేయనున్నారు.

ఇది ఇలా ఉండగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కల్పించింది. అదేవిధంగా వంట గ్యాస్ 500 రూపాయలకే అందించే పథకాన్ని కూడా ప్రారంభించింది. కానీ ఇది ఇంకా పూర్తిస్థాయిలో అర్హులకు అందడం లేదు. అదేవిధంగా ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయల ఆర్థిక సాయం అందించే పథకంపై విధివిధానాలు కొంతమేరకు అధికారులు రూపొందించారని తెలిసింది.
కానీ ఇంకా పూర్తిస్థాయిలో చర్చ కొనసాగలేదు.

మహాలక్ష్మి లో ₹ 2500 పొందడానికి ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలనేది నిబంధన ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా మహిళ గృహిణిగా ఉండాలని నిబంధన కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఉద్యోగం చేయకుండా ఇంటి దగ్గర ఉండే మహిళలకే ఈ పథకాన్ని వర్తింప చేయనున్నారు. అంతేకాకుండా ఆసరా పింఛన్లు పొందుతున్న మహిళలు ఉన్నట్లయితే వారిని కూడా ఈ పథకం నుంచి మినహాయించే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పొందే ఉద్యోగాలు చేస్తున్న మహిళలను కూడా ఈ పథకం నుంచి మినహాయించనున్నారు.

ఆగస్టు 15 తర్వాత ఈ పథకం అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంపై కసరత్తు నిర్వహించనున్నారు. ఆగస్టు నెలాఖరులోగా ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

ALSO READ : 

BIG ALERT: వారందరికీ రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు కట్.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..!

POSTAL: పోస్టల్ శాఖలో 50వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్, రాత పరీక్ష లేకుండా ఎంపిక..!

 

మరిన్ని వార్తలు