POSTAL: పోస్టల్ శాఖలో 50వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్, రాత పరీక్ష లేకుండా ఎంపిక..!

ఇండియన్ పోస్టల్ శాఖలో దేశవ్యాప్తంగా వివిధ సర్కిల్ లలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ సిద్ధం చేసింది. సుమారుగా 50వేల గ్రామీణ బ్యాంక్ సేవ ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన వెలువలడనున్నది

POSTAL: పోస్టల్ శాఖలో 50వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్, రాత పరీక్ష లేకుండా ఎంపిక..!

మన సాక్షి , వెబ్ డిస్క్ :

ఇండియన్ పోస్టల్ శాఖలో దేశవ్యాప్తంగా వివిధ సర్కిల్ లలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ సిద్ధం చేసింది. సుమారుగా 50వేల గ్రామీణ బ్యాంక్ సేవ ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన వెలువలడనున్నది. ఎలాంటి రాత పరీక్షలు, ఇంటర్వ్యూ కూడా లేకుండా పదవ తరగతి మార్కుల ఆధారంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

ఎలాంటి రాత పరీక్ష , ఇంటర్వ్యూ లేకుండా కేవలం పదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గ్రామీణ బ్యాంక్ సేవక్ అండ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లాంటి ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.

18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చును. రిజర్వేషన్ ఆధారంగా వయోపరిమితి సడలింపు కూడా ఉంటుంది. వీరికి వేతనం ప్రారంభంలో పదివేల రూపాయల నుండి 12 వేల రూపాయల వరకు నెలకు అందజేస్తారు. పదోన్నతులు ద్వారా ఉన్నత స్థానాలకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది.

ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు సర్వీసుల ద్వారా ఇన్సెంటివ్ లను పొందవచ్చును. గత సంవత్సరం ఈ పోస్టుల భర్తీ కోసం 40,889 ఖాళీలను భర్తీ చేశారు. ఈ ఏడాది 50వేల ఉద్యోగాలకు పైగానే ఉన్నట్లు సమాచారం

ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది. తమ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న పోస్ట్ ఆఫీస్ లలో పనిచేయడానికి ఆప్షన్లను పెట్టుకోవలసి ఉంటుంది. మెరిట్ ఆధారంగా దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ లో పోస్టింగ్ కూడా ఇస్తారు. పోస్టల్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వ శాఖ అయినందున అందులో పని చేసే ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఉంటుంది.

దరఖాస్తు చేసుకున్న తర్వాత పదవ తరగతి లో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఫలితాలను వెల్లడిస్తారు. మెరిట్ ఆధారంగా ఉద్యోగం లభిస్తుంది. అందుకోసం ఈ వెబ్ సైట్ ను ఫాలో అవుతూ ఉంటే నోటిఫికేషన్ తెలుసుకోవచ్చును….

వెబ్ సైట్ :

https://indiapostgdsonline.gov.in

 

ALSO READ : 

HYDERABAD : సంచలనం కలిగించిన బురఖా దొంగలు..కేసు ఛేదించిన సైబరాబాద్ పోలీసులు..!

Free Coaching : సివిల్స్ లాంగ్ టర్మ్ ఉచిత శిక్షణ.. డిగ్రీ పాసైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ వారి నుంచి దరఖాస్తులకు ఆహ్వానం..!

Cm Revanth: పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం..!